మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఆదివాసీ నేత కొమ్ముల బాపు జన్మదిన సందర్భంగా విద్యార్థులకు నోటుబుక్కులు పెన్నులు పంపిణీ*

 *ఆదివాసీ నేత కొమ్ముల బాపు జన్మదిన సందర్భంగా విద్యార్థులకు నోటుబుక్కులు పెన్నులు పంపిణీ*

SCV News Kasipet :-



 కాసిపేట మండలంలో ఆదివాసి హక్కుల కోసం దశాబ్దాల పాటు నిత్యం పోరాడుతున్న గిరిజన ప్రియతమ నేత కొమ్మల బాపు జన్మదిన సందర్భంగా  పాఠశాల విద్యార్థులకు నోటు బుక్స్ పెన్నులను పంపిణీ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం తన జన్మదిన సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

కాసిపేట మండల కేంద్రంలోని దేవాపూర్ పంచాయతీ పరిధిలోగల  పెద్దాపూర్. దిశా మాడల్ స్కూల్, పెద్ద గూడ గిరిజన ప్రాథమిక పాఠశాల, నాయకపూగూడ మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈరోజు శుక్రవారం ఆదివాసి నాయక పోడు సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు గారి జన్మదిన సందర్భంగా విద్యార్థులకు నోటుబుక్కులు పెన్నులు అందించడం జరిగింది. 

ఈ సందర్భంగా  కొమ్ముల బాపు మాట్లాడుతూ తరతరాల దరిద్రాన్ని పారదోలి ఒక్క తరం చదువుకుంటే ఉన్నత స్థానానికి ఎదిగే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని అన్నారు. తల్లిదండ్రులు ఎన్ని కష్టాలైనా పిల్లలను బడికి పంపించాలని కోరారు .

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎనగందుల సతీష్ రెండవ వార్డ్ నెంబర్ ఉపాధ్యాయులు రమేష్ సి ఆర్ పి, ఉపాధ్యాయులు పెంధ్రం చందు సార్ Scrp స్కూల్ కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య పెద్దాపూర్ దిశా మాడల్ స్కూల్,

గోండ్వాడ పంచాయతీ రాయి సెంటర్ ఉపసర్మెడి వెడమ్మ బాపూరావు,కొమ్ముల రజిత ఆదివాసి మహిళా సంగం,గ్రామ పటేల్ ఆత్రం బుజ్జి రావు,కొమ్ముల సంజీవ్ సండ్ర సాయి. పెద్దల వెంకటేష్ అలిపి రెడ్డి లత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.