మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగతెంపులు?

 కాసిపేట మండలానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగతెంపులు?

- మండల ప్రజలు మంచిర్యాల జిల్లా కేంద్రానికి నియోజకవర్గ కేంద్రమైన బెల్లంపల్లికి వెళ్లాలంటే కష్టాలు?

- - -- త్వరలో దుబ్బగూడం గ్రామం పునరావాస క్రేంద్రానికి తరలింపు.

- సింగరేణి ఉపరితల గని విస్తరణకు సోమ గూడెం బ్రిడ్జి కూల్చివేత

- మండల ప్రజలు మేలుకోకపోతే జాతీయ రహదారి పైకి వెళ్లడం కష్టమని హెచ్చరిస్తున్న మండల సామాజిక ప్రజాస్పందన వేదిక కన్వీనర్ సిలోజి మురళి.

- మండలంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల నాయకులు ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని జాతీయ రహదారిపై వెళ్లేందుకు ప్లై ఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం పై ఉద్యమించాలని ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.




SCV News Kasipet:-

 మంచిర్యాల జిల్లా కాసిపేట మండల ప్రజలు కొద్ది రోజుల్లో మంచిర్యాల జిల్లా కేంద్రానికి,నియోజకవర్గ కేంద్రమైన బెల్లంపల్లి కి వెళ్లేందుకు రహదారి లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని మండల సామాజిక ప్రజా స్పందన వేదిక కన్వీనర్ సిలోజి మురళి మండల ప్రజలను ఒక ప్రకటనలో  హెచ్చరించారు.

 సింగరేణి కేకే ఉపరితల గని ముప్పు గ్రామమైన దుబ్బగూడం త్వరలో పెద్దనపల్లి శివారులో నిర్మించిన పునరావాస కాలనీకి తరలిపోనుంది. సింగరేణి యాజమాన్యం పునరావాస కాలనీలో రహదారులు మంచినీటి సదుపాయం విద్యుత్తు ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు ఇండ్లను నిర్మించుకుంటున్నారు. ఐదు ఆరు నెలల్లో ఇండ్లు పూర్తి అవుతుండడంతో గ్రామం మొత్తం తరలిపోనుంది. తరువాత సింగరేణి యాజమాన్యం ఉపర్తీగల గని విస్తరణ పనులలో భాగంగా సోమగుడం వద్ద నిర్మించిన బ్రిడ్జిని కూల్చివేయనుంది. కాసిపేట మండల ప్రజలకు మంచిర్యాల జాతీయ రహదారి ఎక్కేందుకు మంచిర్యాల బెల్లంపల్లి వెళ్లేందుకు  ఇదే ప్రధాన రహదారిగా ఉంది.

 సింగరేణి యాజమాన్యం కాస్పేట మండల ప్రజలు వెళ్లేందుకు ప్రత్యామ్నాయంగా మందమర్రి వైపు బెల్లంపల్లి వైపు బిటి రహదారిని నిర్మిస్తుంది. గత రెండు సంవత్సరాలుగా మందమరి వైపు బీటి రహదారి నిర్మించడంతో మండల ప్రజలు మంచిరాల వైపు వెళ్తున్నారు. త్వరలో బెల్లంపల్లి వైపు కూడా కంకర రోడ్డు నిర్మాణం పూర్తయి బి టి వేసేందుకు సిద్ధంగా ఉంది. 

 మండల ప్రజలు నేరుగా జాతీయ రహదారిపై కి వెళ్లేందుకు ఓవర్ బ్రిడ్జి గాని అండర్ బ్రిడ్జి గాని లేవు. ప్రస్తుతం రోజు మందమరి వైపు వెళ్లే ప్రజలకు పోలీస్ సెర్చింగ్ లో చాలాన్ వేయడం జరుగుతుంది. రాంగ్ రూట్లో వెళ్లడం వల్ల ప్రమాదాలకు ప్రయాణికులు గురవుతున్నారు.

 మండలంలోని రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు మేల్కొని సింగరేణి యాజమాన్యం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కాసిపేట మండల ప్రజలు జాతీయ రహదారిపై వెళ్లేందుకు ఫై ఓవర్ లేదా అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఉద్యమించాలని సామాజిక ప్రజాస్వాందన వేదిక కన్వీనర్ సి రోజు మురళి ప్రకటనలో కోరుతున్నారు. లేకుంటే భవిష్యత్తులో ప్రజలు జాతీయ రహదారిపై వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని దీనిపై ఐక్య కార్యాచరణ కమిటీ వేసుకొని ఇప్పటి నుండే పోరాడాలని మండల ప్రజలను కోరారు.