మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

సా చై వే ఆధ్వర్యంలో జాతీయ స్థాయికి ఎంపికైన కళారీ విద్యార్థులకు సన్మానం

 సా చై వే ఆధ్వర్యంలో జాతీయ స్థాయికి ఎంపికైన  కళారీ విద్యార్థులకు సన్మానం.

Scv News Kasipet:-




కాసిపేట మండలం కేంద్రంలోని పల్లం గూడ గ్రామపంచాయతీ పరిధిలో గల యుద్ధం సింగ్ కలారి ఆశ్రమంలో ఈరోజు గురువారం  సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో జాతీయ స్థాయికి ఎంపిక అయిన విద్యార్థులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో విద్య నభ్యసిస్తూ పల్లం గూడెం లోని సత్యదమ్మ బుద్ధం సింగ్ కళారీ ఆశ్రమంలో గురు యశ్వంత్ మహారాజ ఆధ్వర్యంలో  కళారీ యుద్ధ విద్యలో శిక్షణ పొందుతున్న పల్లం గూడెం గ్రామానికి చెందిన పత్తిపాక సిద్ధార్థ్, పత్తిపాక హర్షిత్ కుమార్ లు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ఈనెల 27న ఎల్బీ స్టేడియం లో కాలరి యుద్ధ విద్య పై రాష్ట్ర స్థాయి కేలో ఇండియా యూత్ గేమ్స్ లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి శిక్షణ శిబిరానికి ఎంపికయ్యారు.  దాన్ని ఉద్దేశించి సామాజిక చైతన్య వేదిక నాయకులు సత్య ధర్మ ఆశ్రమంలో విజయం సాధించిన విద్యార్థులకు మరియు గురువు గారికి సాధారణంగా సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో 

పల్లం గూడా సర్పంచ్ దుస్స విజయ,కోమటిచేను న్ సర్పంచ్ జాడి మాణిక్య శంకర్, ఉప సర్పంచ్ కొడప అనంతరావు బుగ్గ గూడెం ఉపసర్పంచ్ రాజయ్య సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు,మదినేని ని చిన్న భీమయ్య ముఖ్య సలహాదారు, రామ టెంకి  విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు.