మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో ఉచిత ఆయుర్వేద శిబిరం

 దేవాపూర్ లో ఉచిత ఆయుర్వేద శిబిరం

Scv News Kasipet:-



కాసిపేట మండల కేంద్రంలోని దేవాపూర్ ఏజెన్సీ గ్రామపంచాయతీ పరిధిలోని కమ్యూనిటీ హాల్ లో బుధవారం రోజున జాతీయ ఆయుర్వేద దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.దీన్ని పురస్కరించుకొని డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాపూర్  సర్పంచ్ సీడం రామ్ దాస్ గారు. ఆదివాసి నాయక పోడు సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు హాజరై నారు. ముందుగా ధన్వాంతరి చిత్రపటానికి పూలమాలలు అర్పించి కొబ్బరికాయ కొట్టి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా  గ్రామ సర్పంచ్ రాందాస్ మాట్లాడుతూ సనాతన కాలం నుండి ఆయుర్వేదం కొనసాగుతూ వస్తుంది దేవాపూర్ ప్రజలు మన జీవనశైలిని మార్పు చేసుకొని యోగ ప్రాణాయామం ధ్యానము ప్రతినిత్యం చేయాలని దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్ బిపి నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు చర్మ వ్యాధులు మహిళలకు సంబంధించిన వ్యాధులకు మన ఆయుర్వేదంలో మందులు వాడుకొని ఆరోగ్యవంతులు కావాలని కోరడం జరిగింది. సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం ధీర్గకాళిక రోగలను నయం చేసేందుకు చాలా పని చేస్తుందన్నారు. భారతీయ ప్రాచీన వైద్యం ఆయుర్వేద మని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రామకృష్ణ. ఫార్మసిస్టు రమాదేవి యోగ టీచర్ గీత దేవి , రోడ్డ అనిల్ ఆదివాసి తుడుం దెబ్బ నాయకుడు,కుంట నరసయ్య దేవాపూర్ ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది..