తాటిగూడ పంచాయతీలో స్వచ్ఛభారత్.
Scv news Kasipet
తాటిగూడ గ్రామంలో శ్రమదానం చేస్తున్న గ్రామస్తులు.
కాసిపేట మండలం తాటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని తాటిగూడ గ్రామంలో ఈరోజు శ్రమదానం స్వచ్ఛతా హీ సేవా & స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ప్రజా భాగస్వామ్యంతో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
గ్రామంలోని ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను గడ్డిని గ్రామ గిరిజనులు స్వచ్ఛందంగా శుభ్రం చేశారు. మండలంలోని ఇతర గ్రామాల ప్రజలు కూడా తాటిగూడ పంచాయతీ ప్రజలను కూడా ఆదర్శంగా తీసుకొని తమ గ్రామంలోని రహదారుల ఇరువైపులా శుభ్రం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ మన తాటిగూడ గ్రామాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత. స్వచ్ఛతా హీ సేవా స్ఫూర్తితో ప్రజలందరూ కలిసికట్టుగా పాల్గొని గ్రామ పరిసరాలను శుభ్రం చేసుకోవడం అభినందనీయం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధులు రాకుండా మన కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి.ఇలా సుందరీకరించిన ప్రదేశాలలో గ్రామస్తులు ఎవరూ మళ్లీ చెత్త వేయకూడదు. ప్రతి ఇంటా తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి ప్రతిరోజూ వచ్చే పంచాయతీ చెత్త సేకరణ వాహనానికే అందించాలి. రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే పంచాయతీ నిబంధనల ప్రకారం చర్యలు తప్పవు.
మన తాటిగూడను ఆదర్శ స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ఇదే భాగస్వామ్యం తో సహకరించాలి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక వార్డు సభ్యులు మడావి దేవు,గ్రామస్తులు మడావి రాజేష్మ,మడావిగోపాల్వే,వేలాది అర్జు,మడావిలక్ష్మి,వెలాదిజంగు బాయి తదితరులు పాల్గొన్నారు.
