* బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం *
Scv News Kasipeta :-
కాసిపేట మండలం ముత్యంపెల్లి గ్రామంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల శాఖ అధ్యక్షులు సూరం సంపత్ కుమార్ & సీనియర్ నాయకులు పెద్దపల్లి శంకర్ చేతుల మీదుగా జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. తదనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా కాసిపేట గణనాథుని సన్నిధిలో పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రెడ్డి బాలరాజు, మండల ఉపాధ్యక్షులు నగరా రపూ ప్రసన్న, రెడ్డి చారులత, మహిళా మోర్చా అధ్యక్షురాలు వనిత బిజెపి నాయకులు ఆయిలి సురేందర్, దుర్గం రాయ లింగు, రోహిత్ సాయి తదితరులు పాల్గొన్నారు.

