మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ ఉన్నత పాఠశాలలో సాచైవే ఆధ్వర్యంలో ఘనంగా ప్రజాకవి కాళోజి జయంతి వేడుకలు.

 దేవాపూర్  ఉన్నత పాఠశాలలో సాచైవే  ఆధ్వర్యంలో ఘనంగా ప్రజాకవి కాళోజి  జయంతి వేడుకలు.

 - కాళోజి జీవితం పై విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస పోటీలు.

Scv News Kasipet 

 





కాసిపేట మండలం దేవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు కాలోజి నారాయణరావు జయంతి, తెలంగాణ భాష దినోత్సవం సందర్భంగా

సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలంగాణ కవి కాళోజి నారాయణరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు తెలంగాణ ఉద్యమకారుడే కాకుండా తెలంగాణ భాష ఉద్యమానికి ఎంతో సేవ చేశారని అన్నారు. ఈనాటి విద్యార్థులే రేపటి భవిష్యత్ నిర్మాణకర్తలని మహనీయుల జీవిత చరిత్రలను విద్యార్థు తెలుసుకొని వారి ఆశయాల కోసం పనిచేయాలన్నారు. విద్యార్థులలోని సృజనాత్మకత తెలుపడానికి కోసం సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో అవగాహన వ్యాసరచన,ఉపన్యాస పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు బోధించిన బోధనలు మంచి క్రమశిక్షణతో పాటించి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులను కోరారు. 

 సామాజిక చైతన్య వేదిక ప్రధాన సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ  కాలోజి నారాయణరావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేశాడన్నారు. ఆంధ్ర వలసవాద పాలనలో తెలంగాణ ప్రజల  జరుగుతున్న అన్యాయాలు దోపిడిపై ఎన్నో కవితలు రాసి ప్రజలను చైతన్య వంతం చేశా రన్నారు. విద్యార్థులు దేశ నాయకుల జీవిత చరిత్రలు వారి వ్యాసాలను కవితలను తెలుసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. 

 *కాళోజి జీవితం పై విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస పోటీలు, విజేతలకు బహుమతులు అందజేత .

  కాళోజి జీవితంపై విద్యార్థులకు వ్యాసరచన మరియు, ఉపన్యాస పోటీలు  నిర్వహించడం జరిగింది. ఈ వ్యాసరచన పోటీలో ఫస్ట్ బహుమతి ఎస్. సౌమ్య 9వ తరగతి,రెండవ బహుమతి ఎస్. మీనాక్షి పదవ తరగతి, ఉపన్యాస పోటీలలో మొదటి బహుమతి శివాని ఎనిమిదవ తరగతి,రెండవ బహుమతి వైష్ణవి 9వ తరగతి. బహుమతులు గెలుపొందారు. 

ఈ కార్యక్రమంలో సామాజిక చైతన్య వేదిక నాయకులతో పాటు పాఠశాల ఇన్చార్జ్ హెడ్మాస్టర్ సురేష్ బాబు ఉపాధ్యాయులు .రాజేష్, నిర్మల, పద్మకుమారి, మహేష్, రజిత ,మరియు విద్యార్థులు పాల్గొన్నారు.