మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఘనంగా ఆదివాసి అమరుడు రోడ్డ రమేష్ ఆరవ వర్ధంతి కార్యక్రమం.

 ఘనంగా ఆదివాసి అమరుడు రోడ్డ రమేష్ ఆరవ వర్ధంతి కార్యక్రమం.




Scv News Kasipet:-

 కాసిపేట మండలంలో ని గిరిజన గుడాల అభివృద్ధి గిరిజన హక్కుల సాధన కోసం నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలలో పాల్గొని అకాల మృతి చెందిన ఆదివాసి నాయకపోడ్ జిల్లా నాయకుడు రోడ్డ చిన్న రమేష్ ఆరవ వర్ధంతి కార్యక్రమం ఈరోజు దేవపూర్ నాయక్ గూడెంలో కుటుంబ సభ్యులు వివిధ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కులసంప్రదాయ ప్రకారం పూజ నిర్వహించి,జెండా ఆవిష్కరణ చేసి, విగ్రహానికి పూలమాల వేసి గణంగా నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు రోడ్డు రమేష్ గిరిజన గుడాల అభివృద్ధి కోసం చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కొమ్ముల భాపన్న (ఆదివాసీ నాయకపొడ్ సేవసంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి),కనక రాజు(తుడుందెబ్బ జిల్లా నాయకులు),సిడం గణపతి(రాయిసెంటర్ గీతాదర్,

ఆత్రం మహేష్ (కొలంసంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు),

బద్ది శ్రీనివాస్ (ఆదివాసీ నాయకపోడ్ మండల అధ్యక్షులు),

మంగ శ్రీకాంత్ (తుడుందెబ్బ మండల అధ్యక్షులు),

పెంద్రం ప్రభాకర్ (విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు),

మెరుగు శంకర్ (అదానీ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్),

రెడ్డి లక్మన్ (సాంస్కృతిక కార్యదర్శి ),

రొడ్డ అనిల్ (తుడుందెబ్బ నాయకులు), గ్రామ పెద్దలు

రొడ్డ జజయ్య, గడ్డం భీమయ్య రోడ్డ లచ్చులు, మహిళలు , కుటుంబసభ్యులు పాల్గొన్నారు.