- మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా రెడ్డి బాలరాజ్,
- కాసిపేట మండల అధ్యక్షుడిగా భూక్యా నాగరాజు నియామకం.
scv News Kasipet:-
కాసిపేట మండలంలో వివిధ గిరిజన గ్రామాలలో బిజెపి పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లా మండల కమిటీలో మండల నాయకులను నియమించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బిజెపి జిల్లా సమావేశంలో సమావేశంలో ఎస్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి బాలరాజ్ మరియు కాసిపేట మండల అధ్యక్షుడిగా భూక్యా నాగరాజు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా రెడ్డి బాలరాజు, భూక్య నాగరాజు మాట్లాడుతూ కాసిపేట మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ,ఎస్టీ మోర్చా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు. మండలంలోని గిరిజన ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.నమ్మకంతో బాధ్యత అప్పగించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బాలరాజు, నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ పదవి రావడానికి కృషిచేసిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్ కి బిజెపి జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ కి బిజెపి ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ కి ప్రత్యేకంగా కాసిపేట మండల బిజెపి అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.
