మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

సా చై వే ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం

సా చై వే ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం.




Scv News Kasipet:--

కాసిపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో  రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రశంస పత్రాలు అందుకున్న ఉత్తమ ఉపాధ్యాయులను  ఘనంగా సన్మానించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు  మాట్లాడుతూ సామాజిక తత్వవేత్త మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఆదర్శాలను ఆలోచన విధానాన్ని పిల్లలను ప్రేమతో కన్న బిడ్డల వల్లే 

రాజు పేద బేధం లేకుండా విద్యను అందించిన వారే నిజమైన గురువులని అన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్య బోధన సాగించాలని విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత చదువులు చదువుకోవాలని విద్యార్థులను కోరారు. సామాజిక చైతన్య వేదిక ముఖ్య సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధనలను శ్రద్ధగా విన్న విద్యార్థులు ఎంతో ఉన్నతంగా ఎదుగుతారని అన్నారు. ఉపాధ్యాయుల బోధనలను సేవలను గుర్తించి ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన  గురువులను సన్మానించడం మా సంస్థకు గర్వకారణం గా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపాల్ ఖలీల్, సన్మాన గ్రహీత ఉపాధ్యాయులు నాగమల్లయ్య ఎం రమేష్ కుమార్ శ్రీనివాసు బోధన సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. సన్మానం.