మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఘనంగా బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతి కార్యక్రమం.*

 కాసిపేట మండలంలో  ఘనంగా బహుజన పోరాటయోధుడు  సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతి కార్యక్రమం.




Scv news Kasipet:

కాసిపేట మండలంలోని కొండాపూర్ చౌరస్తాలో మండల గౌడ సంఘం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జన్మదినోత్సవ కార్యక్రమం  ఈరోజు  ఘనంగా నిర్వహించారు. మోకు దెబ్బ మండల నాయకులు సభ్యులు సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోకు దెబ్బ మండల సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ సర్వాయి పాపన్న 350 సంవత్సరాలకు పూర్వమే  దేశంలోనే మొదటిసారిగా  తెలంగాణలో బహుజన రాజ్యాన్ని స్థాపించిన యోధుడని కొనియాడారు. 30 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించి బహుజన వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయులన్నారు.

 బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న స్ఫూర్తితో బహుజనులంతా బహుజన రాజ్య స్థాపన కోసం కృషి చేయాలన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్  ఇచ్చిన ఓటు హక్కును తెలంగాణలో 90 శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో తమ ఓటు తాము వేసుకుని  బహుజన రాజ్య స్థాపన కోసం ఉద్యమిస్తు న్నారన్నారు.  ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం సలహాదారులు నేరెళ్ల బుగ్గగౌడ్ సంయుక్త కార్యదర్శి , పడాల మల్లేష్ గౌడ్,   మండల యూత్ కమిటీ అధ్యక్షులు  కోయాడ అంజన్న గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రావణ్ గౌడ్, సంయుక్త  కార్యదర్శి , కోశాధికారి బుర్ర ప్రకాష్ గౌడ్, యూత్ నాయకులు నేరెళ్ల రవి, చరన్ గౌడ్  రజక సంగం మండల నాయకులు   . దావనపల్లి లక్ష్మణ్, టిఆర్ఎస్ మండల నాయకులు సుధాకర్ రెడ్డి లతోపాటు  కాసిపేట, ధర్మారావుపేట మల్కపల్లి, కొండాపూర్  గౌడ సంఘ సభ్యులంతా పాల్గొన్నారు.