మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో యోగ దినోత్సవం

 దేవాపూర్ లో యోగ దినోత్సవం 



Scv news kspt:

కాసిపేట మండలం దేవపూర్ ఏజెన్సీ గ్రామపంచాయతీ ఆవరణలో గల కమ్యూనిటీ హాల్ లో ఈరోజు ఆదివారం ఆయుష్మాన్ భవ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రజా ప్రతినిధులు విద్యార్థులు సంఘాల నాయకులు యోగ ఆసనాలు ప్రాణాయామం ధ్యానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సిడం రాందాస్ మాట్లాడుతూ మన దేవాపూర్ లో యోగ సెంటర్ ఇద్దరు యోగ మాస్టారు ఉన్నారు నిత్యం ఉదయం సాయంత్రం ఉచితంగా యోగ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రజా ప్రతినిధులు సంఘాల నాయకులు మహిళా సంఘాల సభ్యులు వచ్చి యోగం చేసి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలను పోగొట్టుకోగలరని ఆయన కోరారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.కొమ్ముల బాపు ఆదివాసి నాయక పోడు సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్ది శ్రీనివాస్ నాయకపోడు సేవా సంఘం మండల అధ్యక్షులు ఎనగందుల సతీష్ రెండవ వార్డ్ నెంబర్ నాగార్జున యోగ మాస్టర్ గీతాదేవి యోగ మాస్టర్ రమాదేవి ఆయుర్వేదిక్ కాంపౌండర్ విద్యార్థులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.