మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

నేడు బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి.

నేడు బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి.

 తెలంగాణలో 355 సంవత్సరాల క్రితమే బహుజన రాజ్యాన్ని స్థాపించిన బహుజన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.

- 30 ఏళ్లు రాజ్యాన్ని పరిపాలించిన మనువాద కుట్రలతో చరిత్రలో కనుమరుగైన సర్దార్ పాపన్న గౌడ్.

- బ్రిటీష్ చరిత్రకారుల కృషితో వెలుగులోకి వచ్చిన పాపన్న చరిత్ర.

 - సర్వాయి పాపన్న చరిత్ర, ఇంగ్లాండు లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో భద్రం.

- ఆల్బర్ట్ మ్యూజియం ఫోటో ఆధారంగానే పాపన్న విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్న గౌడ సంఘాలు. 

పాపన్న పోరాట స్ఫూర్తితో తెలంగాణలో బీసీ రాజ్యాధికారం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా ఏకమై మన ఓట్లు మనం వేసుకుని అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా  బహుజన పోరాట యోధుడు గురించి నేటి తరం తెలుసుకోవాలి...

పునాది లేని ఇల్లు,  చరిత్ర తెలియని జాతి రెండు ఒకటే. పునాది లేకుంటే ఇల్లు బల పడదు, చరిత్ర తెలియకుంటే జాతి బాగుపడదు,నిలబడదు. చరిత్ర తెలియని వాడు, చరిత్రను నిర్మించ లేడు "

-  బాబాసాహెబ్ అంబేద్కర్.

 " సింహాలు తమ చరిత్రను రాసుకోలేనంతవరకు  వేటగాళ్లు రాసిందే వాటి చరిత్ర అవుతుంది "

  - చినువా అచీబా ,దక్షిణాఫ్రికా చరిత్రకారుడు 

 బహుజన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.

Scv News Kasipet:--

 భారతదేశంలో  తరతరాలుగా అణచివేయ బడుతున్న  బహుజన కులాలకు చెందిన  ఎస్సీ ఎస్టీ బీసీల వారికి రాజ్యాధికారం సాధించి పెట్టాలని దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం  భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ లాంటి మహనీయులు జీవితాంతం పోరాడారు . అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో త్యాగాలు చేసి తన భార్యా పిల్లలను కూడా అంబేద్కర్ బలిపెట్టి మనకు రిజర్వేషన్లు, ఓటు హక్కును సాధించి పెట్టాడు. దేశ జనాభాలో 85శాతం ఉన్న బహుజను లు స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు గడిచిన తమ ఓటు హక్కు తో తమ వర్గాలను గెలిపించు కోకుండా అగ్రవర్ణాల  ప్రలోభాలకు ( డబ్బు, మందు,  మద్యానికి, ) లొంగి బహుజన రాజ్యం సాధించలేక పోతున్నారు. అగ్రవర్ణాల కుట్ర,కుతంత్రాలతో బహుజనుల అంతా కులాల పేరిట చీలికలై రాజ్యాధి  కారానికి దూరంగా ఉంటున్నారు. జనాభాలో 15% ఉన్నా అగ్రవర్ణాలు దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత గత 78 ఏళ్లుగా అధికారాన్ని తమ చేతుల్లో పెట్టుకొని బహుజనుల పై పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ దేశంలో బహుజన రాజ్యం ఎప్పుడు వస్తుందోనని  దశాబ్దాలుగా కలలు కంటున్నాము...

కానీ... ఈ దేశంలోని తెలంగాణలో 356 సంవత్సరాల క్రితం బహుజన రాజ్యాన్ని  సాధారణ కల్లుగీత కార్మికుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్థాపించాడు. క్షత్రియుడు కత్తి పట్టి రాజ్యాన్ని పరిపాలించాలన్నా అగ్రవర్ణాల మనువాద చతుర్వర్న  సిద్ధాంతాన్ని గండి కొట్టి గోల్కొండ ఖిల్లా ను స్వాధీనం చేసుకుని తెలంగాణ గడ్డను  పరిపాలించిన సంగతి మన బహుజన వర్గాలకు చాలామందికి తెలవదు. తెలంగాణలో 22 కోటలను నిర్మించి 30 ఏళ్లుగా నిరాటంకంగా బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసి స్వయం పాలన సాధించిన గొప్ప బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. బహుజనులకు ఆ పోరాట యోధుడు చరిత్ర తెలవకుండా మనువాదులు, అగ్ర వర్ణాల చరిత్ర కారులు కుట్రలు చేశారు. పాపన్న గౌడ్ చరిత్ర ముందు తరాల బహుజనులకు తెలిస్తే అతన్ని ఆదర్శంగా తీసుకుని రాజ్యాధికారం కోసం తిరగ బడతారని అగ్రవర్ణాలు గ్రహించి ఉద్దేశపూర్వకం గానే అతన్ని చరిత్రలో బందిపోటుగా చిత్రీకరించారు. అతడి రాజ్యాధికార చరిత్రను, శిలాశాసనాలు, ఫోటోలు కూడా కనపడకుండా చేశారు. నేడు పాపన్న చరిత్రను జానపద కథల ద్వారా  బుర్రకథలు, సారధి కాల కథల ద్వారానే తెలంగాణ బహుజనులు తెలుసుకొనే పరిస్థితి ఉంది.

అనాదిగా ఈ దేశంలోని మూలవాసుల మైన బహుజనుల చరిత్ర మొత్తం అగ్ర వర్ణాలు చదువు వారి చేతుల్లో ఉండటంవల్ల వక్రీకరించి వ్రాయబడిం ది. వాళ్లకు అనుకూలమైన చరిత్రను రాసుకొని మన బహుజన పోరాట యోధులను నరరూప రాక్షసులు గా బందిపోట్లుగా చిత్రీకరించి మన తోటి మన వారిని చెడ్డవారిగా  చూపిస్తు  న్నారు. ఇప్పటికీ మనం మూలవాసు లైన అసుర రాజులను రావణాసురుడు నరకాసురుడు, దసరా, దీపావళి పండుగల  సందర్భంలో వారి దిష్టిబొమ్మలను మన తోటి తగలబెట్టి స్తున్నారు. మనువాదులు వారికి అనుకూలమైన చరిత్రనే పుస్తకాలలో రాయించుకుని మనతో చదివిస్తు న్నారు. నాటి బహుజన పోరాట యోధుల చరిత్రను విదేశస్తుల ద్వారానే తెలుసుకునే దుస్థితి నేడు బహుజను లకు ఉంది. భారతదేశంలో కి ఆంగ్లేయు లు వచ్చిన 19వ శతాబ్దం తర్వాతనే బహుజన పోరాటయోధులు అసలైన చరిత్ర బయటికి వచ్చింది. ఆంగ్లేయ చరిత్రకారులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి జానపద కథల ద్వారా, శిల్ప సంపద వల్ల అసలైన చరిత్రను వెలికితీసి బాహ్య ప్రపంచానికి  తెలియ జేశారు.

భారత దేశంలోని బహుజన పోరాట యోధులు చరిత్ర లండన్ మ్యూజియంలో,  గ్రంథాలయాలలో భద్రంగా దాచిపెట్టారు. వందల సంవత్సరాలుగా మను  వాదుల కుట్రలకు కనుమరుగైన అసలైన చరిత్రను మన దేశానికి చెందిన మహాత్మా జ్యోతిరావు పూలే, బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయుల పరిశోధనల వల్ల సురులు,  అసురుల మధ్య జరిగిన యుద్ధాలు,  పురాణాల్లో రాక్షసులుగా చిత్రీకరించబడిన  మన మూలవాసుల రాజుల చరిత్రను వారు రాసిన పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నాం. 

   బహుజన పోరాటయోధుల చరిత్ర ఎందుకు వక్రీకరించ బడ్డది?

భారతదేశంలో   రెండువేల ఏళ్లుగా  చాతుర్వర్ణ సిద్ధాంతం తో  ఆధిపత్యం చెలాయిస్తున్న బ్రాహ్మణ మనువాద వర్గ వాదనను  తుంగలో తొక్కి  శూద్రుడైన  సర్దార్ సర్వాయి పాపన్న రాజ్యాన్ని పరిపాలించారు. గతంలో  వృత్తి ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసిన బహు జనులను ధర్మాన్ని ధిక్కరించారు అని కఠిన శిక్షలు విధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి . 16వ శతాబ్దంలో శూద్ర కులానికి చెందిన మరాఠా యోధుడు శివాజీ, అతని సమకాలికుడైన తెలంగాణ పోరు బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడులు క్షత్రియుడు పట్టాల్సిన కత్తిని వీరు చేపట్టి దక్షిణ భారతదేశంలో మొగలాయి సామ్రాజ్యం విస్తరించకుండా అడ్డుకున్నారు. అప్పటి ఢిల్లీ  సుల్తాన్ ఔరంగజేబ్ కు ఎదురించి పోరాడి రాజ్య పాలన చేశారు.  సూద్రులు రాజ్యపాలన చేయడం  బ్రాహ్మణ వర్గాలకు రుచించలేదు. వీరిపై కక్ష కట్టి రాజులుగా గుర్తిం చేందుకు నిరాకరించారు.శివాజీ పట్టాభిషేకం చేసేందుకు బ్రాహ్మణ వర్గం నిరాకరించింది. చివరకు కాశీ నుండి గాగా బట్టు అనే బ్రాహ్మణ పండితుడు తన ఎత్తు బంగారాన్ని కానుకగా తీసుకొని  ఎడమ కాలి బొటన వేలుతో శివాజీకి తిలకం దిద్ది అవమానించారు. 

శివాజీ సమకాలికుడైన తెలంగాణ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన రాజ్య పాలన గురించి చరిత్రలో అతని పేరు లేకుండానే చేశారు.

తెలంగాణ బహుజన రాజ్య వ్యవస్థాపకుడు సర్దార్ పాపన్న చరిత్ర ఇది.... 


జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో క్రీస్తుశకం 1650 ఆగస్టు18న సర్వమ్మ ధర్మాన్నగౌడ్ దంపతులకు పాపన్న గౌడ్ జన్మించాడు. చిన్న తనంలోనే పాపన్న తండ్రి ధర్మాన గౌడ్ మృతి చెందడంతో తల్లి ఎంతో గారాబంగా పెంచారు. పాపన్న కల్లుగీత వృత్తిలో కొనసాగుతూనే చిన్నప్పటినుండే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. గ్రామాల్లో నవాబులు, భూస్వాములు జాగీర్దార్ల ఆగడాలను సహించే వాడు కాదు. బహుజన కులాలకు చెందిన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు సభ్ లతో స్నేహం చేశాడు. పాపన్న కల్లు మండువాలో కల్లు  అమ్ముతుండగా గోల్కొండ నవాబు సైనికులు కల్లు  తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయేవారు. ఒకరోజు అలాగే సైనికులు వెళ్ళిపోతుండగా అతడి స్నేహితుడు ' కల్లు  తాగి వెళ్ళిపోయే నిరుపేద నవాబు సైనికులు సిద్ధంగా ఉన్నారని' హేళనగా మాట్లాడారు. దీనికి ఆగ్రహం చెందిన నవాబు సైనికులు అతని స్నేహితున్ని  కాలుతో తన్నారు. తన స్నేహితుని పై దాడి చేయడంతో పాపన్న ఆగ్రహం చెంది కళ్ళు తీసే కత్తితో నవాబు సైనికుని చంపాడు. మిగతా సైనికులంతా గుర్రాల ను, వసూలు చేసిన సిస్తూ డబ్బులు అన్ని పడవేసి పారిపోయారు. గుర్రాలను సిస్తూ డబ్బులను పాపన్న స్వాధీనం చేసుకొని 12 మంది స్నేహితులతో దళాన్ని ఏర్పాటు చేసి భూస్వాముల, జాగీర్దార్ల గడిలపై దాడులు చేశారు. తిండి గింజలను ఆస్తులను స్వాధీనం చేసుకొని పేదలకు పంచడం తో జనగామ ప్రాంతంలో అతని పేరు మార్మోగింది.

గ్రామాల్లోని భూస్వాములు జాగీర్దార్లు గోల్కొండ నవాబు దగ్గరికి వెళ్లి పాపన్న దళం బారినుండి తమను కాపాడాలని వేడుకొన్నారు. పాపన్న నవాబు సైన్యాలను దొరకకుండా అజ్ఞాతవాసం లోకి వెళ్ళాడు. జగిత్యాల జిల్లా పొలాస జమిందార్ వెంకట్రావు వద్ద పాలేరు గా చేరాడు. అక్కడ హనుమంతు అనే స్నేహితుడు కలిసి యువకుల ను చేరదీసి భూస్వాముల జాగీర్దార్ల వ్యతిరేకంగా ఉద్యమం లేవదీశారు. రాత్రుల్లో వారి గడిల పై దాడులు చేసి ఆస్తులను స్వాధీనం చేసుకొని పేదలకు పంచేవారు. ఈ విషయం జమీందార్ వెంకట్రావు తెలుసు కుని పాపన్నను పట్టుకొని జైల్లో బంధించారు.పాపన్న తన స్నేహితుల సహకారంతో జైలు గోడలను పగులగొట్టుకుని ఖైదీల తో పాటు జమీందార్ల గడిలలో బందీలుగా ఉన్న బహుజన యువకులు అందరిని విడిపించా రు.

వారితో ఒక సైన్యం ఏర్పాటు చేసి క్రీస్తుశకం 1675 లో మొదట బహుజన రాజ్యాన్ని సర్వాయిపేట లో స్థాపించి పెద్ద కోటను నిర్మించి 30 ఏళ్లు బహుజన రాజ్యాన్ని పాలించాడు . కల్లుగీత వృత్తి నుండి రాజ్యపాలన కు ఎదిగిన సర్వాయి పాపన్న గౌడ్ బడుగు బలహీన వర్గాల కోసం పాలనా సంస్కరణలు తెచ్చారు. తన రాజ్యాన్ని కరీంనగర్ హుజూ రాబాద్, హుస్నాబాద్ ప్రాంతాలకు  విస్తరించాడు. కోటలన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. కొత్తగా ఇరవై రెండు కోటలను నిర్మిం చాడు. సర్వాయి పాపన్న రాజ్య విస్తరణ అడ్డుకొని అతను నుండి తమను కాపాడాలని ఈ ప్రాంత భూస్వాములు జాగీర్దార్లు అప్పటి గోల్కొండ నవాబు రుస్తుం దిల్ ఖాన్ వద్ద మొరపెట్టు కున్నారు. క్రీస్తుశకం 1706లో గోల్కొండ నవాబు తన సేనాని కాసిం ఖాన్ ను పాపన్న గౌడ్ రాజ్యంపై యుద్ధానికి  పంపాడు. సర్వాయి పాపన్న గౌడ్ నవాబు సైన్యాలను ఎదిరించి ఖాసీంఖాన్ ని  చంపేశాడు. ఈ విషయాన్ని గోల్కొండ నవాబు తో పాటు మొగల్ చక్రవర్తి కూడా తీవ్రంగా పరిగణించి పాపన్న రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించారు. ఈలోగా 1707 సంవత్సరంలో  ఢిల్లీ సుల్తాన్ మొగల్ చక్రవర్తి ఔరంగజేబు అనారోగ్యంతో మృతి చెందాడు.

ఢిల్లీ సింహాసనంపై వారసుల మధ్య మధ్య పోరు సాగింది. ఇదే అదనుగా సర్వాయి పాపన్న మచిలీపట్నం నుండి డచ్ దేశస్థులు నుండి తుపాకులు ఫిరంగులు కొనుగోలు చేశాడు. 1708 సంవత్సరంలో 3000 సైన్యంతో తెలంగాణలో పేరుగాంచిన  కాకతీయు ల వరంగల్ కోట, భువనగిరికోటలపై దాడి చేసి స్వాధీనం చేసు కున్నాడు. 1709 సంవత్సరంలో 12, 000 సైన్యంతో గోల్కొండ కిల్లా పై దాడి చేసి స్వాధీనం చేసుకున్నాడు. ఢిల్లీ సింహాస నాన్ని ఔరంగజేబు తదనంతరం  బహదూర్ షా ఎక్కాడు. సర్వాయి పాపన్న ధైర్య సాహసాలు అతని బహుజన  రాజ్య పరిపాలన గురించి తెలుసుకున్న ఢిల్లీ సుల్తాన్ బహదూర్ షా యుద్ధానికి బదులు రాజీ  కుదుర్చుకున్నాడు. ఢిల్లీ సుల్తానుకు సామంతునిగా ఉండి చట్టబద్ధంగా పన్నులు కట్టి గోల్కొండను ఏలుకోవాలని  కోరడంతో సర్వాయి పాపన్న గౌడ్ సమ్మతించాడు.14 లక్షల నగదు కప్పంతోపాటు మొగలు సైన్యాల ను ఆహారధాన్యాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకొని గోల్కొండ పాలించ సాగాడు. సర్వాయి పాపన్న గౌడ్ గోల్కొండ కిల్లా నా పాలించడం భూస్వాములు పెత్తందార్లు జాగీర్దార్ల కు మింగుడు పడలేదు. బహదూర్ షా కు లేనిపోని విషయాలు చెప్పి అతనిపై యుద్ధానికి పంపించారు. గోల్కొండ కోటను పాపన్న గౌడ్ ఏడు నెలల పాలించిన తర్వాత 1709 సంవత్సరంలో మొగల్ సైన్యంపై యుద్ధానికి దిగాడు. తాటికొండ వద్ద సర్వాయి పాపన్న, మొఘల్ సైన్యానికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాపన్న సైన్యం ఓడిపోయింది.

పాపన్న అజ్ఞాతంలోకి వెళ్లాడు. హుస్నాబాద్ ప్రాంతంలో గౌడ కులస్తుల వద్ద కల్లు మండువాలో తలదాచుకున్న విషయం మొగల్ సైన్యాలకు ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పట్టు బడ్డారు. భవిష్యత్తులో తెలంగాణలో బలహీనవర్గాలవాడు రాజ్యా ధికారం కోసం పోరాడ వద్దని బహుజనులను భయభ్రాంతులకు చేసేందుకు సర్వాయి పాపన్న గౌడ్ తలను నరికి ఢిల్లీ సుల్తాన్ బహదూర్ షా కు బహుమానంగా పంపారు. మొండాన్ని గోల్కొండ కోటకు వేలాడదీశారు. ఇలా మూడున్నర శతాబ్దాల క్రితం తెలంగాణ లో మొట్ట మొదట బహుజన రాజ్య స్థాపకుడు బలహీన వర్గాల పోరుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర ముగిసింది.

బహుజన పోరాటయోధుడు సర్వాయి సర్దార్ పాపన్నగౌడ్ చరిత్ర ఎలా బయటకు వచ్చింది ?  


మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సమకాలికుడైన సర్దార్ సర్వాయి పాపన్న  గౌడ్ కు చరిత్రలో శివాజీ కి వచ్చిన పేరు రాలేదు. మహారాష్ట్రలో శివాజీని మరాఠా యోధుడిగా గుర్తించి ప్రతి గ్రామంలో,  పట్టణంలో అతడి విగ్రహాలు కనబడతాయి. తెలంగాణలో మాత్రం బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న విగ్రహం కనబడదు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్  ట్యాంక్ బండ్ మీద ఎందరో విగ్రహాలు ఉన్నాయి. కానీ ఈ గడ్డమీద 30 ఏళ్లు బహుజన రాజ్యాన్ని స్థాపించిన పాపన్న విగ్రహం లేదు. అగ్రవర్ణాలు ప్రభుత్వాలు ఉద్దేశ పూర్వకంగానే పాపన్న చరిత్ర బహుజనులకు తెలిస్తే అతని స్ఫూర్తిగా తీసుకొని తమపై ఎక్కడ తిరుగుబాటు చేస్తారు అని బహుజన రాజ్యం కోసం పోరాటాలు చేస్తారని భయపడి పాపన్న చరిత్రను కనుమరుగు చేశారు.  అగ్రవర్ణాలు, పెత్తందార్లు ముస్లిం చరిత్రకారులు అతని  దోపిడీ దొంగగా  బందిపోటుగా చిత్రీకరించి ప్రచారం చేశారు.  

బ్రిటిష్ చరిత్రకారుల పరిశోధనలతోనే బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర బయటకొచ్చింది .

17వ శతాబ్దంలో బ్రిటీష్ చరిత్రకారుడు జె కె బోయర్ తెలంగాణలోని పల్లెల్లో తిరిగి ప్రజల నోళ్లలో నానుతున్న జానపద కథలు,  సాహిత్యం, బుర్ర కథలు చెప్పే కళాకారుల ద్వారా  అసలైన చరిత్రను తెలుసుకొని రికార్డు చేయడంతో పాపన్న గౌడ్ వీరచరిత్ర బాహ్యప్రపంచానికి  తెలిసింది. ప్రపంచంలో పేరు గాంచిన లండన్లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ అతడి వీరచరిత్రను గుర్తించి  పుస్తకాన్ని ప్రచురించింది. పుస్తకానికి రివ్యూ రాసిన బ్రిటిష్ చరిత్రకారుడు ప్రొఫెసర్ రీఛార్జ్ పీటర్ పాపన్న గొప్ప బహుజన యోధుడు అని గుర్తించారు.  భారత దేశంలో ఆరు వందల ఏళ్ళ క్రితం గొప్ప పోరాట వీరుల చరిత్రను వెలికి తీసి అందులో 8 మంది వీరులలో  సర్వాయి పాపన్న మొదటి వాడుగా గుర్తించింది. 

తెలంగాణ గడ్డపై సర్వాయి పాపన్న కు సంబంధించిన సాహిత్యం, శాసనాలు, చిత్రపటాలు భావితరాల బహుజను లకు అందకుండా చేశారు ఆనాటి అగ్రవర్ణాల  పాలకవర్గాలు. ఇంగ్లాండ్ లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం లో బ్రిటిష్ వారు బహుజన  పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వీరత్వాన్ని గుర్తించి అతని చిత్రపటాన్ని  పెయింటింగుల్లో భద్రపరిచారు. హైదరాబాదు కు చెందిన ప్రముఖ చిత్రకారుడు ఒకరు బ్రిటిష్ వారి మ్యూజియం లో ఉన్న పాపన్న పెయింటింగ్ తీసుకువచ్చి ఇక్కడ ప్రదర్శించారు. అదే ఫోటోను విగ్రహాలు గా చేసి మొదట కరీంనగర్ జిల్లా లో పాపన్న రాజ్య పాలన చేసిన సర్వాయిపేట లో, నిర్మల్ జిల్లా లో పెట్టారు అవే  విగ్రహాలు ప్రస్తుతం రాష్ట్రంలో గౌడ  సంఘాలు గ్రామాల్లో పెడుతున్నాయి. తెలంగాణ రాజ్యంపై ఢిల్లీ సుల్తాన్ పెత్తనాన్ని దిక్కరించి గోల్కొండ కిల్లా పై స్వాతంత్ర బాహుట ఎగరవేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజనులు అందరికీ స్ఫూర్తిదాయకం.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గురించి మన దేశ చరిత్రకారులుఏమన్నారో చూడండి.!

18వ శతాబ్దానికి చెందిన భార తీయ చరిత్రకారుల్లో ప్రముఖులు మల్లాది సోమ శేఖరశర్మ, హరి ఆదిశేషువు,  బి.ఎన్.శాస్త్రి, పేర్వారం జగన్నాథం,  బిరుదు రాజు రామరాజు, ఏటుకూరి బలరామమూర్తి లాంటి మహనీయులు సర్దార్ పాపన్న గౌడ్ గురించి పరిశోధించి కొన్ని విషయాలు బయట ప్రపంచాన్ని తెలిపారు. " స్వయంగా దుర్గములను నిర్మించి యుద్ధంతో దుర్గములను సాధించి రాజ్యాన్ని విస్తరించే వాడు దొర  కాక దొంగ ఎట్లా అగును " అని  సోమశేఖర శర్మ ప్రశ్నించారు.

" కేవలం ఉత్సాహం వల్ల నేస్తాన్ని పరిమితమైన సైన్యాన్ని సమీకరించి గోల్కొండ నవాబును కాందిశీకుణ్ణి చేయగలిగిన ఈ తెలుగు వీరుడు గాద వినసొంపైనది " అంటూ హరి ఆదిశేషు కీర్తించారు. 

" సర్వాయి పాపన్న దారిదోపిడి దారుగా వ్యవహరింపబడ్డడే కానీ అతడు ముస్లిం పాలకుల పాలిట  కాలుడు. బీద ప్రజల దైవం స్వతంత్ర భావాలు కలిగి ఉన్న అతి సామాన్య కుటుంబంలో జన్మించి నాయకుడిగా వీరుడిగా రాజ్య పాలన ఎదిగాడు. ఆంధ్ర పౌరుషాన్ని చాటిచెప్పిన వీరుడు అరివీర భయంకరుడు తెలుగువారి స్వాతంత్రాన్ని పరిరక్షించిన పోరాటయోధుడు " అంటాడు బి.ఎన్.శాస్త్రి 

 అధికారికంగా కార్యక్రమం చేస్తే సరిపోదు, ట్యాంక్ బండ్ పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.

 తెలంగాణ ప్రభుత్వం సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఈ సంవత్సరం నుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలలో అధికారికంగా జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేయడం శుభసూచకం. దీంతోపాటు 

* తెలంగాణలో మూడున్నర శతాబ్దాల క్రితమే బహుజన రాజ్యాన్ని స్థాపించిన సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ చరిత్ర గ్రామ గ్రామానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది.

* తెలంగాణ ప్రభుత్వం  పాపన్న అసలైన చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి.

* ట్యాంకుబండ్ పై సర్దార్ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. 

* రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బిసి బహుజనుల అంతా పాపన్న పోరాట స్ఫూర్తితో తెలంగాణలో బహుజన రాజ్యాధికారం కోసం మన ఓటు మన వేసుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఉద్యమించాలి. 

* బహుజన సోదరులంతా పోరాటయోధుడు పాపన్న 375 జయంతి ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా కోరుతుంది.