మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బహుజన పోరాట యోధుడు, మరాఠా వీరుడు చత్రపతి శివాజీ మహారాజ్ 394 జన్మదినం నేడు

మరాఠా వీరుడు చత్రపతి శివాజీ అసలైన చరిత్ర తెలుసుకుందాం!

 బహుజన పోరాటయోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ 


Scv News Kasipet:--

బహుజన పోరాటయోధుడు చత్రపతి శివాజీని జీవించి ఉన్న సమయంలో చక్రవర్తిగా గుర్తించని మనువాద  బ్రాహ్మణ పురోహిత వర్గంకు చెందిన బిజెపి, విశ్వహిందూ పరిషత్,లు నేడు శివాజీ హిందూ నాయకుడంటూ శోభా యాత్రలు చేయడాన్ని బహుజన సమాజం ఖండించాల్సి న అవసరం ఉంది. చదువు వారి చేతుల్లో ఉండడం వల్ల శివాజీ చరిత్రను వక్రీకరించి తమకు అనుకూలంగా రాసుకున్నారు. శివాజీ అసలైన చరిత్ర బహుజన వర్గాలు తెలుసుకొని జన్మదిన ఘనంగా జరుపుకోవాలి.

భారతదేశంలో 16వ శతాబ్దంలో  మొగలాయి సామ్రాజ్యాన్ని మహారాష్ట్రలో విస్తరించకుండా  అడ్డుకొని ఎదిరించి పోరాడి మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మరాఠా యోధుడు బహుజన సామాజిక వర్గానికి చెందిన చత్రపతి శివాజీ మహారాజ్. మహారాష్ట్రలో బహుజనుల సంరక్షకుడిగా, రైతు బాంధవుడుగా, మహిళల హక్కులను కాపాడిన మహోన్నతుడిగా శివాజీ మహారాజ్  పేరు సంపాదించాడు.  విదేశీ లైన మొగలాయి సామ్రాజ్యాన్ని మహారాష్ట్ర నుండి తరిమికొట్టి  ఢిల్లీ మొగలాయి సామ్రాజ్య సుల్తాన్ ఔరంగజేబును గడగడ లాడించి మహావీరుడు  చత్రపతి శివాజీ మహారాజ్. శివాజీ వీరత్వాన్ని  మాత్రం హిందూ మతోన్మాద లైన మనువాద బ్రాహ్మణులు అతడు జీవించినంత కాలం గుర్తించలేదు. శివాజీ పరిపాలిస్తున్న కాలంలో అతనికి వ్యతిరేకంగా ముస్లిం రాజుల చేతుల ఓడిపోవాలని చండీ యాగాలు చేశారు. పట్టాభిషేకం చేసేందుకు నిరాకరించారు. కోట్లాది ధనం తీసుకుని గాగాబట్టనే బ్రాహ్మణుడు పట్టాభిషేకం పేరిట శూద్రుడుని ముట్టుకోవద్దు అంటూ ఎడమ కాలి బొటన వేలుతో తిలకం దిద్ది అవమానపరిచాడు. ప్రతాప్ గడ్ లో కృష్ణాజి భాస్కర్ కులకర్ణి కత్తితో దాడి చేసి శివాజీని గాయపరిచాడు. చివరకు మోరో పంత్  పింగ్లే పాలల్లో విషమిచ్చి  శివాజీ మృతికి కారణమయ్యాడు బ్రాహ్మణులు జీవితాంతం శివాజీని   అడుగడుగున  అవమానిస్తూ  అతని ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈరోజు  చత్రపతి శివాజీ ని అవమానించిన ఆనాటి మనువాద బ్రాహ్మణులే  శివాజీ  హిందూ వీరుడు అంటూ గో బ్రాహ్మణుల రక్షకుడు అంటూ  కాషాయ జెండాలు పట్టుకొని శోభ యాత్రలు నిర్వహిస్తూ  జన్మదినోత్సవాలు జరపడం విడ్డూరంగా ఉంది. బహుజన వర్గమంతా ఆలోచించాలి. శివాజీ జీవిత చరిత్ర పై సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా అందిస్తున్న ప్రత్యేకతనం..

చత్రపతి శివాజీ జీవిత విశేషాలు

 చత్రపతి శివాజీ మహారాజ్ ఫిబ్రవరి 19 1630లో పూణే జిల్లాలోని జున్నార్ సమీపంలోని శివనేరి కిల్లా లో తండ్రి సహాజీ రాజే, తల్లి జిజావు బాయి కి జన్మించాడు. తండ్రి కున్బీ అనే శూద్ర కులంలో జన్మించాడు.తల్లి జిజావుబాయి మహర్ కులంలో జన్మించారు. శివాజీ తండ్రి,తల్లి  బంధువులంతా విదేశీ పాలకుల దగ్గర సర్దార్లుగా జీవనం సాగిస్తూ వారికోసం యుద్దాలలో పాల్గొనేవారు. మొగల్, నిజాం రాజుల కోసం యుద్ధం చేసి ప్రాణాలర్పించే కన్నా   తామే ఎందుకు యుద్ధ వీరులం కావద్దని జిజియా బాయ్  ఆలోచించింది. మరాఠా సామ్రాజ్య స్థాపన కోసం తన కొడుకు  శివాజీకి  చిన్నప్పటి నుండి వీర గాధలు వినిపించి యుద్ధ విద్యలు నేర్పించారు. బహుజన వర్గాల విముక్తి కోసం సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసి 14 ఏళ్ల వయసులోనే  శివాజీ రాజ్యపాలకుడయ్యాడు. అనతి కాలంలోనే మహారాష్ట్రలో తిరుగులేని నాయకుడిగా ఎదిగి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

 చత్రపతి శివాజీ మహారాజ్  హాయంలోప్రజా రంజక పరిపాలన.

 శివాజీ మహారాజ్ పరిపాలనలో మహారాష్ట్రలో బహుజన వర్గాలను ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవనం సాగించారు. అన్ని కులాలు మతాలతో శివాజీ సత్సంబంధాలు నెలకొల్పి తమ సైన్యంలో అందరిని చేర్చుకొని ప్రజాసైన్యంతో ఇతర రాజులపై యుద్ధాలు చేసి విజయం సాధించాడు. రైతులకు ప్రత్యేక రాయితీలు ఇస్తూ పంటలను ప్రోత్సహించేవాడు. భూమి సిస్తు తగ్గించాడు. సైన్యం ద్వారా కానీ తన అధికారుల ద్వారా రైతుల పంటలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూశారు. ఎవరైనా నష్టం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు నష్టపరిహారం చెల్లించేవాడు.

మహిళల ను వేధించే వారిని క్షమించేవాడు కాదు.

తన రాజ్యంలో మహిళల మహిళలపై అత్యాచారాలు చేసి హింసించే వారిని సహించేవాడు కాదు. మహిళలపై అఘాయిత్యం పాల్పడ్డ సొంత సైన్యాధికారుల శిక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

 శూద్రుడు రాజ్యమేలడం బ్రాహ్మణ వర్గాలకు నచ్చలేదు.

భారతదేశంలో మూడు వేల ఏళ్లకు పైగా ఆధిపత్యం చెలాయిస్తున్న మనువాద బ్రాహ్మణులు  చాతుర్వర్ణ సిద్ధాంతం ప్రకారం క్షత్రియులు  మాత్రమే రాజ్య పాలనచేయాలి. శూద్ర జాతికి చెందిన చత్రపతి శివాజీ కత్తిపట్టి యుద్ధం చేసి మొగలాయి సైన్యాన్ని మట్టి కరిపించి మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం హిందూ పురోహిత వర్గానికి ఇష్టం లేదు.

 శివాజీని అడుగడుగునా అడ్డుకున్న బ్రాహ్మణ వర్గం.

వైదిక ధర్మానికి వ్యతిరేకంగా శూద్రుడు రాజ్యమేలడం బ్రాహ్మణ వర్గం జీర్ణించుకోలేకపోయింది.శివాజీ ని రాజుగా గుర్తించేందుకు నిరాకరించారు. "విదేశీయులు అయిన మొగలాయిలు పాలించ డానికి నేను ఇష్టపడతాము కానీ శూద్ర  జాతికి చెందిన శివాజీ రాజ్యమేల డాన్ని మేము సహించము "అంటూ మనువాద బ్రాహ్మణులు బహిరంగంగా ప్రకటించారు.

* శివాజీకి మిర్జా జై సింగ్ తో యుద్ధం సమయంలో శివాజీ ఓడిపోవాలని అఫ్జల్ ఖాన్ గెలవాలని సతారా జిల్లా వాయు ప్రాంతంలో లక్ష్మణ శాస్త్రి 400 మంది బ్రాహ్మణులచే  కోటి చండీ యాగం చేసిన ఘనత బ్రాహ్మణ పురోహిత వర్గంది. అఫ్జల్ ఖాన్ తో యుద్ధంలో భాగంగా చర్చల కోసం శివాజీ తన ప్రతాప్ గడ్ కోటకు పిలిచాడు. అతని వెంట వకీలుగా వచ్చిన కృష్ణాజి భాస్కర్ కులకర్ణి అఫ్జల్ ఖాన్ను శివాజీ హత్య చేసిన తర్వాత శివాజీ పై భాస్కర్ కులకర్ణి దాడి చేసి  గాయపరిచాడు. తర్వాత శివాజీ చేతిలో హతమయ్యాడు. నిరంతరం యుద్ధాలతో  మహారాష్ట్రలో చిన్న చిన్న రాజ్యాలు అన్నిశివాజీ జయించాడు.  మొగలాయి సామ్రాజ్యా న్ని మరాఠా నుండి పారదోలి  మరాఠా సామ్రాజ్యం ఏర్పాటుచేసిన శివాజీని చక్రవర్తిగా గుర్తించేందుకు బ్రాహ్మణ పురోహిత వర్గం  నిరాకరించింది. అప్పటి ఆచారాల ప్రకారం రాజు పట్టాభిషేకం అయిన తర్వాతనే సామంత రాజులు అతనికి లోబడి ఉండేవారు.చత్రపతి శివాజీ పట్టాభిషేకం చేసేందుకు మరాఠా లోని బ్రాహ్మణ పురోహిత వర్గం నిరాకరిస్తే వారణాసి నుండి గగా బట్టు అనే బ్రాహ్మణ పురోహితుని తీసుకువచ్చి అతడు కోరిన పరిహారం ఏనుగు మీద ఎక్కి పైసలు చిమ్మితే ఇంత ఎత్తుకు ఎదుగుతుందో అంత బంగారు నాణాలు కావాలని షరతు పెట్టాడు. దానికి కూడా శివాజీ ఒప్పుకొని పట్టాభిషేకం చేయించు కొనేందుకు ముందుకు వచ్చాడు . శూద్రులను ముట్టుకోవడం పాపం కాబట్టి  గంగా బట్టు అనే పురోహితుడు కూడా శూద్ర  జాతికి చెందిన శివాజీని చేతితో ముట్టు కోకుండా ఎడమ కాలి బొటనవేలుతో తిలకం దీద్ది  మరాఠా యోధుని ఘోరంగా అవమానించారు.  శివాజీ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉన్న మోరోపతి పిన్గలే  బ్రాహ్మణుడు  కుట్రపూరితంగా శివాజీకి ఆహారంలో విషమించి మృతికి కారకులయ్యారు. 

 జ్యోతిరావు పూలే తో వెలుగులోకి వచ్చిన శివాజీ చరిత్ర.

 చత్రపతి శివాజీ మరణించిన తర్వాత అధికారికి వచ్చిన పీష్వా బ్రాహ్మణుల పాలనలో శివాజీ చరిత్రను అతని, అని సమాధి ఎక్కడ ఉందో తెలియకుండా కనుమరుగు చేశారు. శివాజీ మృతిచెందిన 189 సంవత్సరాల తర్వాత మహాత్మ జ్యోతిరావు పూలే రాయగడ్ కోటలో శివాజీ మహారాజ్ సమాధి ఉన్నట్టు కనుగొని బాహ్య ప్రపంచానికి తెలిపాడు. శివాజీ చరిత్రపై దీర్ఘకావ్యం రాసి పూనే బొంబాయి మహారాష్ట్రలో అతని జీవిత గురు చరిత్ర గురించి ప్రచారం చేశారు. శివాజీకి కూల్వాడి భూషణ్( రైతు రత్నం) బిరుదును ప్రధానం చేశాడు. 1870లో మొదటిసారి శివాజీ జయంతిని జరిపాడు. 

పూలే వారసత్వాన్ని అంబేద్కర్ కొనసాగించాడు.

మరాఠా యోధుడు చత్రపతి శివాజీ చరిత్ర ను బ్రాహ్మణ మనువాద వర్గం వక్రీకరించి తమకు అనుకూలంగా మార్చుకోవడాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. శివాజీ చరిత్రను పరిశోధించి మరిన్ని విషయాలను వెలుగులోకి తెచ్చాడు. 1927 ఫిబ్రవరి 19న శివాజీ జన్మదినం సందర్భంగా  రాయగడ్ లో ఉన్న చత్రపతి శివాజీ సమాధి వద్ద ఒక రోజంతా గడిపి మదనపడ్డాడు. తరువాతే ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాడు. రాయిగడ్ సమీపంలోని మహదు చెరువు నీరు తాగేందుకు 1927 మార్చి 20 న, డిసెంబర్ 15న మనస్మృతిని తగలబెట్టారు. 1930లో శివాజీ 300 జయంతి ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 బహుజన సోదరులంతా మేల్కొనాలి.

చత్రపతి శివాజీ సమకాలికుడైన బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ ను  కూడా మనువాద బ్రాహ్మణులు గుర్తించలేదు. తెలంగాణలో 34 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన చరిత్రలో అతని పేరు లేదు. బహుజన పోరాట యోధులైన శివాజీ, సర్వాయి పాపన్నల  చరిత్ర బహుజనులకు తెలిస్తే ముందు తరాలు  మాపై తిరగ బడి మాకు పుట్టగతులు ఉండవు అని గుర్తించి ముందు తరాలకు చరిత్ర  అందకుండా కను మరుగు చేశారు. ఇప్పుడు అదే హిందూ మనువాద బ్రాహ్మణ పురోహిత వర్గానికి చెందిన అనుబంధ సంస్థలైన బిజెపి, విశ్వహిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, ఏబీవీపీ ఆల్ హిందూ మతోన్మాదులు శివాజీ మావాడు అంటూ కాషాయ జెండాలు పట్టుకుని శోభయాత్ర  పేరిట ఊరేగింపులు నిర్వహిస్తు బహుజన సమాజాన్ని మోసం చేస్తున్నారు . చరిత్రలో తరతరాలుగా మనువాదులు బహు జనం కోసం పోరాడిన యోధులను వారి జీవిత కాలమంతా వ్యతిరేకించి వారు చనిపోయిన తర్వాత ప్రజల్లో ఉన్న ఆదరాభి మానాలను గుర్తు చేసుకుని తమ వాడుగా  ప్రకటించు కోవడం మను వాదులు అలవాటే.

ఉదా:యజ్ఞయాగాదులను వ్యతిరేకించి,  ఆత్మ లేదని నిరీశ్వర వాదాన్ని ప్రచారం చేసిన గౌతమ బుద్ధుని దశావతారాలు చేర్చుకోవడం, జీవితమంతా బహుజనుల కోసం పోరాడిన అంబేద్కర్ మావాడు అంటూ జన్మదినో త్సవాలు జరుపు తున్నారు.  బహుజనుల మైన ఎస్సీ ఎస్టీ బీసీలము మాత్రం మన బహుజన పోరాట యోధులు బుద్ధుడు, పూలే, అంబేద్కర్ శివాజీ, సర్వాయి పాపన్నలను గుర్తించు కోకుండా నివాళులర్పించ కుండా నిర్లక్ష్యం వహిస్తున్నాము. ఇప్పటికైనా బహుజన సోదరులు కళ్ళు తెరిచి బహుజన జాతి విముక్తికి పోరాడిన పోరాట యోధులు చత్రపతి శివాజీ,సర్వాయి పాపన్న లను  గుర్తు చేసుకుంటూ , మహాత్మ పూలే,  అంబేద్కర్ సామాజిక ఉద్యమాలకు మద్దతు ప్రకటించి ఉద్యమించాలని కోరుతున్నాం.