మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మనుధర్మ శాస్త్రం అంటే ఏమిటి

 మనుషులను మనుషులుగా గుర్తించని ధర్మశాస్త్రం, మనుధర్మ శాస్త్రం 


Scw News Kasipet

 మనుధర్మ శాస్త్రం గురించి  అంటే ఏమిటి?

 బాబా సాహెబ్ అంబేద్కర్  మనుషులను మనుషులుగా గుర్తించని మనుధర్మశాస్త్రాన్ని దహనం చేసిన రోజు దాని గురించి నేటి తరానికి చెందిన  బహుజన వర్గాలకు తెలియ చెప్పేందుకు 'Scv News ' అందిస్తున్న ప్రత్యేక కథనం .!

భారతదేశంలో బ్రాహ్మణవాదులు కుట్రపూరితంగా చివరి బౌద్ధ రాజైన సామ్రాట్ అశోక చక్రవర్తిముని మనుమడు  బృహ ద్రద్రుడిని క్రీస్తుపూర్వం 185 వ సంవత్సరంలో అతడి సర్వ సైన్యాధ్యక్షుడైన బ్రాహ్మణ సేనాని పుష్యమిత్రుడు హత్య చేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. బౌద్ధ ప్రజాస్వామ్య, బహుజన రాజ్యాన్ని అంతం చేసి ప్రతిఘాతక విప్లవం ద్వారా దేశంలో బ్రాహ్మణ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. పుష్యమిత్ర శుంగుడు  అధికారంలోకి వచ్చిన తర్వాత బహుజనులకు విద్యను నిషేధించాడు, బౌద్ధ ఆరామాలను కూల్చివేశాడు,బౌద్ధ బిక్షులను ఊచ కోత కోసి బౌద్ధాన్ని ఈ దేశం నుండి పారతోలారు. అప్పటికి ఉన్న వర్ణ వ్యవస్థ నుండి కుల వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కులాల మధ్య సంబంధాలు లేకుండా ఒకరిని ఒకరిని కలవకుండా 6,000 కులాలుగా బహుజన వర్గాలను విభజించాడు. కుల వ్యవస్థ నిరాటంకంగా కొనసాగించేందుకే సుమతి భార్గవ అనే పండితుడిచే మనుధర్మశాస్త్రం రచించబడింది. మను ధర్మశాస్త్ర బ్లూ ప్రింట్ ప్రకారమే గ్రామాలు నెలకొల్ప బడ్డాయి. అస్పృశ్యులుగా  పిలవబడ్డ మాల, మాదిగ పల్లెలు గ్రామానికి దూరంగా ఏర్పాటయ్యాయి.

2,135 సంవత్సరాలుగా భారత దేశంలో మనుధర్మశాస్త్రం అమలు.

పుష్యమిత్ర సుంగుడి కాలం నుండి అంబేద్కర్ రాజ్యాంగం అమలులోకి వచ్చేంతవరకు  సుమారు రెండువేల సంవత్సరాలుగా ఈ దేశంలో మనుధర్మ శాస్త్రం ఆధారంగానే పరిపాలన సాగింది.ఈ ధర్మ శాస్త్రం ఆధారంగానే రాజులు పరిపాలన సాగించేవారు. బహుజనులు అయినా ఎస్సీ ఎస్టీ బీసీలు ఏమైన తప్పులు చేస్తే ఈ ధర్మశాస్త్ర ఆధారంగానే శిక్షలు విధించేవారు.

మనుషులను మనుషులుగా గుర్తించని ధర్మశాస్త్రము మనుధర్మ శాస్త్రం. 

బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశాలలో చదువు ముగించుకుని భారతదేశానికి వచ్చిన తర్వాత బహుజనుల విముక్తి కోసం 1927 నుండి మానవ హక్కుల పోరాటాలాను ప్రారంభించాడు.ఆ పోరాటాలలో ప్రధానమైంది మనుధర్మ శాస్త్ర దహనం. బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 మార్చి 20న ప్రారంభించిన మహద్ చెరువు పోరాటంలో మనుస్మృతి గురించి ఆలోచించాడు. ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన బహుజనుల అణచివేతకు మనుధర్మశాస్త్రంమే మూలం అని గుర్తించాడు. నాటి మహారాష్ట్రలో చెరువులలో మూడు వర్ణాల అయినా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలు మాత్రమే నీరు తాగే వారు. శూద్రులు అతి శూద్రులను నీరు త్రాగనిచ్చేవారు కాదు. మహారాష్ట్రలోని లక్ష చెరువుల్లో ఇదే పరిస్థితి ఉండేది. మహద్ చెరువు పోరాటం విజయవంతం అయిన తర్వాత 1927 డిసెంబర్ 25న బహుజనుల వివక్షకు మెజారిటీ ప్రజల అణచివేతకు  మూల కారణమైన మనుధర్మ శాస్త్ర దహనం కార్యక్రమాన్ని చేపట్టాడు. కార్యక్రమం అప్పుడు దేశం లో ప్రకంపనలు సృష్టించింది.

మనుధర్మ శాస్త్రం లోని  కొన్ని ముఖ్యమైన విషయాలు! 

1. శూద్రులు స్మృతి చదవరాదు

2. శూద్రులను  వీళ్లను నీచమైన పేర్లతోనే పిలవాలి.

3. సూద్రులు బ్రాహ్మణుల్ని తిట్టినప్పుడు నాలుకను,కొట్టిన చేతిని,తన్నిన కాళ్లను నరకాలి.

4. శూద్రుడు బ్రాహ్మణుల పక్కన  కూర్చుంటే పిరుదులు కోయాలి, లేదా  వీపుపై వాతలు పెట్టాలి.

5. శూద్రుడు అగ్రవర్ణాల స్త్రీలతో సంభోగిస్తే   అంగాన్ని కోయాలి, లేదా ప్రాణంతో ఉండగానే చాపలా చుట్టి తగలబెట్టాలి.

6. బ్రాహ్మణుడు అగ్రవర్ణాల స్త్రీలతో విచారిస్తే గుండు కొట్టాలి లేదా ఊరు నుంచి వెళ్ళగొట్టాలి.

7. బ్రాహ్మణులు తప్పు చేస్తే దానం చేసి  ఊరినుండి పంపించాలి. శూద్రుడు తప్పు చేస్తే వాడిని చంపాలి.

8. బ్రాహ్మణుడు  మూర్ఖుడైన, నీచుడై నా దైవ  సమానుడే .

9. చండాలుడు( మాల మాదిగలు ) శవాల మీద బట్టలు కట్టుకోవాలి,  కుండలో అన్నం తినాలి. ఇనుప ముక్క నగలు ధరించాలి.

10. స్త్రీకి ఎలాంటి స్వాతంత్రం లేదు. బాల్యంలో తల్లిదండ్రుల పై, యవ్వనంలో భర్త పై, వృద్ధాప్యంలో కొడుకు పై ఆధారపడి మాత్రమే జీవించాలి.

మనుధర్మ శాస్త్రం లోని కొన్ని విషయాలు. ఇప్పటికి భారత దేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగకుండా మను  ధర్మశాస్త్ర ప్రకారమే పాలన సాగుతోంది. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మరోసారి ఈ దేశంలోకి అధికారంలోకి వస్తే బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని  మార్చి మనుధర్మ శాస్త్రాన్ని అమలులోకి తెస్తామని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే హిందూ  మత ప్రచారకులు హిందూ మత రాజ్యాంగాన్ని రాశామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. హిందూమత రాజ్యాంగ అమలులోకి వస్తే ఇప్పుడున్న బహుజన వర్గాల హక్కులన్నీ అంతరించిపోతాయి.

బహుజన వర్గాలు చరిత్రను తెలుసుకొని చైతన్యవంతం కావాలి.

దేశంలోని 85 శాతం ఉన్న బహుజనులు చైతన్యవంతులైన ఐకమత్యం కావాల్సిన అవసరం ఎంతైనాఉంది. మహాత్మ జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా ఉద్యమించాల్సిన అవసరం ఆసన్న మైంది. బహుజనులు చైతన్యవంతం కావాలంటే ప్రధానంగా  బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు గా చరిత్రను తెలుసుకోవాలి." పునాది లేని ఇల్లు చరిత్ర తెలియని జాతి రెండు ఒకటే. పునాది లేకుంటే ఇల్లు నిలబడదు. చరిత్ర తెలియకుంటే జాతి బాగుపడ దు. చరిత్ర  తెలియనివాడు చరిత్రను నిర్మించ లేడు." అంబేద్కర్ వాదులు  భారతదేశ చరిత్ర ను, అంబేద్కర్ రచించిన పుస్తకాలను విరివిగా చదివి చరిత్రను తెలుసు కోవాలి. చరిత్రను అధ్యయనం చేసి గ్రామీణ ప్రాంతంలో తరాలుగా మన బహుజను లకు జరిగిన అన్యాయం పై గ్రామస్తులకు వివరించే కార్యక్రమాలు చేపడితే నే  బహుజన ఉద్యమం ఊపందుకుంటోం ది. మనుధర్మ శాస్త్రం దహనం కార్యక్రమం లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ఆశిస్తూ ....