మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ 375 జయంతి కార్యక్రమం.

 కాసిపేట మండలంలో  ఘనంగా బహుజన పోరాటయోధుడు  సర్వాయి పాపన్న గౌడ్ 375 జయంతి కార్యక్రమం.


 

కొండాపూర్ చౌరస్తాలో మోకు దెబ్బ ఆధ్వర్యంలో పాపన్న జయంతి కార్యక్రమంలో పాల్గొన్న గౌడ సంఘ నాయకులు. 

Scv News Kasipet:

కాసిపేట మండలంలోని కొండాపూర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జన్మదినోత్సవ కార్యక్రమం  ఈరోజు మోకు దెబ్బ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మోకు దెబ్బ మండల నాయకులు సభ్యులు సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ మండల సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ సర్వాయి పాపన్న 350 సంవత్సరాలకు పూర్వమే  దేశంలోనే మొదటిసారిగా  తెలంగాణలో బహుజన రాజ్యాన్ని స్థాపించిన యోధుడని కొనియాడారు. 30 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించి బహుజన వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయులన్నారు. మనువాద సిద్ధాంతం ప్రకారం క్షత్రియులే రాజ్య పరిపాలన చేయాలని దానికి విరుద్ధంగా శూద్రుడైన సర్వాయి  పాపన్న రాజ్యపాలన చేయడం బ్రాహ్మణ వర్గం తట్టుకోలేదన్నారు. మొగల్ సామ్రాజ్యం తో కుమ్మక్కై పాపన్న రాజ్యాన్ని కూలదోసి మహా నాయకుడు చరిత్ర కనుమరుగు చేశారని అన్నారు.

 మండలంలో బీసీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. 

 బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న జన్మదిన స్ఫూర్తితో బహుజనులంతా బహుజన రాజ్య స్థాపన కోసం ఉద్యమించాలన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్  ఇచ్చిన ఓటు హక్కుతో 90 శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో తమ ఓటు తాము వేసుకుని  బహుజన రాజ్య స్థాపన కోసం కృషి చేయాలన్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీసీ ఉద్యమం ఊపందుకున్న క్రమంలో   కాసిపేట మండలంలో కూడా బిసీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజాసంఘాల నాయకులంతా ఏకమై బిసి జేఏసీగా ఏర్పడి విద్యా, ఉద్యోగాలు,చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్ కోసం ఉద్యమించాలన్నారు.

మండలంలో వందల సంవత్సరాలుగా ఐదు శాతం కూడా లేని  అగ్రవర్ణాలు రాజ్యాధికారాన్ని తమ చేతిలో పెట్టుకొని  ఆధిపత్యం చెలాయిస్తు న్నాయని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజనుల సత్తా చాటాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం సలహాదారులు నేరెల్లి బుగ్గయ్యగౌడ్,  కోడూరు గురువయ్య గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పోడేటి రాజా గౌడ్, సంయుక్త కార్యదర్శి , పడాల మల్లేష్ గౌడ్, నేరెళ్ల నరసింగం గౌడ్,  మండల యూత్ కమిటీ అధ్యక్షులు  కోయాడ అంజన్న గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రావణ్ గౌడ్, సంయుక్త  కార్యదర్శి , కోశాధికారి బుర్ర ప్రకాష్ గౌడ్, కాసిపేట, ధర్మారావుపేట మల్కపల్లి, కొండాపూర్ లతో పాటు గౌడ సంఘ సభ్యులంతా పాల్గొన్నారు.