మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

జవహర్ బాల్ మంచ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు.

 విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి...--

-- B. ప్రవీణ్ బాబు, జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కోఆర్డినేటర్.

 విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ.



Scv News Kasipet:---

 కాసిపేట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఈరోజు జవహర్ బాల్ మంచ్ ఆధ్వర్యంలో మండలంలోని ఆదర్శ, కేజీబీవీ  పాఠశాలల  విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మందుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోఆర్డినేటర్  ప్రవీణ్ బాబు మాట్లాడుతూ జవహర్ బాల్ మంచ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తూ గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వైద్య పరీక్షలు, జరిపించి మందుల పంపిణీ చేస్తుందని అన్నారు.

 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రేమ్ సాగర్ రావు వర్గం  మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల కృష్ణ మాట్లాడుతూ జవహర్ బాల్ మంచ్ ఇది కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఇది దేశంలోని 7 సంవత్సరాల వయస్సు నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలతో ఈ సంస్థ పనిచేస్తోందని, ఈ నాటి పిల్లలే రేపటి పౌరులగా రూపాంతరం చెందుతారు కాబట్టి ఆనాడే జవహర్ లాల్ నెహ్రూ పిల్లలతో ప్రేమగా వారినీ ఆదరించేవారని , వారి అడుగుజాడల్లో నడవడానికి ఈ సంస్థ పనిచేస్తోందని, అలాగే ఈ  దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ,గాంధీ కుటుంబం గాంధీ కుటుంబం ఈ దేశానికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, భిన్నత్వంలో ఏకత్వం, వ్యవస్థలను బలోపేతం చేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నారని తెలిపారు. ఆసుపత్రి వైద్యులు ఆంజనేయులు, పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.