మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

MEO గా పదోన్నతి పొందిన రామ్ సార్ కు ఆదివాసి సంఘాల నాయకుల సన్మానం.

 

 గిరిజనులు సెడుమొక రాము ను ఆదర్శంగా తీసుకోవాలి.

- ఆదివాసి సంఘాల నాయకుల పిలుపు.


 ఎంఈఓ గా పదోన్నతిపై వెళుతున్న టీచర్ సేడ్ మేక రామును సన్మానిస్తున్న కాసిపేట మండల ఆదివాసి నాయకులు. 



Scv News Kasipet:--

కాసిపేట మండల కేంద్రంలోని దేవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోగల ఆదివాసి మహిళ భవన్లో ఈరోజు రాయి సెంటర్ ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో సెడ్మక రాము ఉపాధ్యాయునికి ఘనంగా సన్మానించారు సేద్మాక రాముకు  మండల విద్యాధికారిగా పదోన్నతి వచ్చిన సందర్భంగా సాలువాతో పువ్వుల పుష్పగుచ్చం తో ఘనంగా సన్మానించడం జరిగింది. 

ఈ సందర్భంగా ఆదివాసి నాయక్ పోడ్ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాపు  మాట్లాడుతూ దేవాపూర్ మారుమూల గ్రామం నిరుపేద ఆదివాసి కుటుంబంలో పుట్టి చిన్నతనము నుండి ఎన్నో కష్టాలు ఎదుర్కొని చదివి ఉపాధ్యాయుని గా ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదివి కన్నె పెళ్లి మండల విద్యాధికారిక పదోన్నతి పొందడం మన మండల వాసులకు గర్వకారణమని కొనియాడారు.ఆదివాసి యువత చదువుపై దృష్టి సారించి సమాజంలో ఉన్నతంగా గౌరవంగా జీవించాలని కోరడం జరిగింది 

ఈ కార్యక్రమములో పాల్గొన్న నాయకులు కుమ్ర జనార్ధన్, రాయ్ సెంటర్ ఉపసర్మేడి 

సిడం శంకర్ తుడుం దెబ్బ మండల ఉపాధ్యక్షులు 

సీడం రాందాస్ ఆదివాసి నాయకులు 

కనక గోవర్ధన్ తుడుం దెబ్బ మండల ఉపాధ్యక్షులు 

మడావి ధర్మారావు ఆదివాసి నాయకులు 

కొమరం జగ్గయ్య రావు ఆదివాసి నాయకులు, సామాజిక చైతన్య వేదిక నాయకులు మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.