కాసిపేట మండల అధికార కాంగ్రెస్ పార్టీలో నాలుగవ వర్గం ఏర్పాటు .
-- ప్రజా సమస్యలను గాలికొదిలి అంతర్గత కుమ్ములాటతోనే అధికార కాంగ్రెస్ పార్టీ.
![]() |
బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మండల బారాస నాయకులు కార్యకర్తలు. |
Scv News Kasipet:--
కాసిపేట మండల రాజకీయాల్లో ఈరోజు ఆసక్తికర పరిణామం జరిగింది. అధికారం లేకుంటే బ్రతకలేని కొంతమంది అగ్రకులాలకు చెందిన నాయకులు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనంగా మారింది. గత పదేళ్లుగా అధికార పార్టీలో కొనసాగీ రాజకీయ ఆధిపత్యంతో ఎన్నో అవినీతి,అక్రమాలకు పాల్పడిన నాయకులు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను ఎన్నో రకాలుగా హింసించారు. కాసిపేట మండలంలో గత నాలుగు దశాబ్దాలుగా ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీలోకి రాజకీయ ఆధిపత్యం కొనసాగించిన నాయకుల వారసత్వంగా వారి వారసులు ప్రతిపక్ష బారసా నుండి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ గెలుపు కోసం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కృషిచేసిన స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు .
గత పది సంవత్సరాలుగా భరాసా పార్టీ అధికారంలో ఉండి ఎన్నో పదవులు, కాంట్రాక్టు పనులు పొంది మండల రాజకీయాల్లో ప్రముఖ నాయకులుగా చెలామనైన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పూసుకురి విక్రం రావు, ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి లు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని బారాస నాయకులు జీ జీర్ణించు కోలేకపోతున్నారు. గతంలో వీరు రెండుసార్లు అధికార పార్టీలో చేరాలని ప్రయత్నించిన సఫలం కాలేదు. మూడోసారి ఎట్టకేలకు ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో మండలంలో మూడు గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నారు. విక్రమ్ రావు తిరుపతిరెడ్డి చేరికతో నాలుగో వర్గంగా ఏర్పాటై ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
గతంలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగు తున్న విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నించారు. అప్పటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య , విక్రమ్ రావు తిరుపతిరెడ్డిలు పార్టీని వీడవద్దని ఎన్నో విధాలుగా బ్రతిమి లాడాడు. అయినా వినకపోవడంతో బరాస పెద్దపెల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, ఓరియంట్ కార్మిక సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ రావులు రంగంలో దిగి మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తే మీకు పదవులు ఇస్తామని బుజ్జగించడంతో పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా బి ఆర్ఎస్ లో కొనసాగారు. అసెంబ్లీ ఎన్నికల్లో దుర్గం చిన్నయ్య గెలుపు కోసం పనిచేశారు.
ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో చిత్తుగా ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరకుండా తప్పు చేశామని విక్రమ్ రావు తిరుపతిరెడ్డిలు మదనపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని గత ఆరు నెలలుగా తీవ్ర ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎంపీ ఎన్నికలకు ముందు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ద్వారా పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుకొన్నారు. ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ గడ్డం వంశి గెలుపు కోసం కృషి చేస్తామని పార్టీలో చేరేందుకు వినోద్ ఇంటికి సుమారు వంద కారులతో వెళ్లా రు. ముత్యం పల్లి ఇతర మండల నాయకులంతా వినోద్ ఇంటి ముందు ధర్నా కు దిగి గొడవ చేయడంతో తీవ్ర అవమానంతో వెను తిరిగి వచ్చారు. రాజకీయాలలో ఎలాంటి నైతిక విలువలు పాటించ కుండా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరడం ఈ రెండు అగ్రకులాలకు చెందిన నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం అధికార పార్టీలో చేరకుంటే తమకు పుట్టగతులు లేవని గుర్తించి అధికార కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి పనిచేస్తున్న కార్యకర్తలంతా పార్టీలోకి రావద్దని ఛీ కొడుతున్న లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిన విక్రం రావు, తిరుపతి రెడ్డిల వైఖరి పట్ల బారసా శ్రేణులు మండల వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
బహుజన వర్గాల యువకులారా మేల్కోండి!
దేశంలో రాష్ట్రాల్లో 85% ఉన్న బహుజన వర్గాలు పది శాతం లేని అగ్రకులాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాధిపత్యం చేతిలో పెట్టుకునేందుకు ఊసరవెల్లుల పార్టీలు మారుతుంటే వారి వెంట డు, డు బసవన్నల మందు,విందులకు ఆశపడి బానిసల్ల తిరగడం మానుకోండి . అగ్రకుల నాయకులు బహుజన వర్గాల యువకులను మందు విందుల ఆశలు చూపి తమ వెంట తీసుకువెళ్లి నాయకుల వద్ద మెజారిటీ చూపి వీరే నా కార్యకర్తలు అంటూ అధికార పార్టీలో ఆధిపత్యం చెల్లాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బహుజన వర్గాలు చైతన్యమై మన ఓట్లు మనం వేసుకుని అధికారంలోకి రావచ్చని వాస్తవాన్ని గుర్తించాలి. మన బలాన్ని మనం గుర్తించకుండా స్వార్థ ప్రయోజనాల కోసం ఆత్మ గౌరవాన్ని చంపుకుని వారి బానిసలుగా చెంచాలుగా మారవద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న ట్టు రాజ్యాధికారం సాధించడం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. బహుజన వర్గాలు చైతన్య వంతులై తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఊసరవెల్లుల్ల పార్టీలు మార్చే నాయకుల వెంట వెళ్లకుండా తమ ఓటు తాము వేసుకొని రాజ్యాధికారం వైపు దృష్టి సారించాలని 'Scv News' కోరుతుంది.