మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండల కేంద్రంలో ని ఆదర్శ పాఠశాలలో సత్యశోధక్ ఆవిర్భావ దినోత్సవం

బహుజన చైతన్యం కోసమే సత్యశోధక్ఏర్పాట్ 

 పూలే సావిత్రిబాయి చిత్రపటాలకు పూలు సమర్పిస్తున్న  విగ్రహాలకు సామాజిక చైతన్య వేదిక నాయకులు పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ నాగమల్లయ్య. 









Scv News Kasipet:--

 కాసిపేట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో  ఈరోజు సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో సమాజ మార్పు కోసం పూలే దంపతులు ఏర్పాటుచేసిన   సత్యశోధక్  సమాజ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మొదట పూలే సావిత్రిబాయి చిత్రపటాలకు నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పువ్వులు సమర్పించారు. 

ఈ సందర్భంగా పాఠశాల ఇన్చార్జి ఉపాధ్యాయుడు నాగమల్లయ్య మాట్లాడుతూ బ్రిటిష్  ప్రభుత్వ  హయాంలో మనువాద బ్రాహ్మణ వర్గం శూద్రులైన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఎలాంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా నిరంకుశంగా వ్యవహరించ రన్నారు. సత్యం తెలుసుకోకుండా చదువు నిరాకరించారు. బహుజనులకు విద్యాబోధన కోసం సత్యశోధకు సమాధి సంస్థ ఆధ్వర్యంలో పూలే గ్రామాలలో పాఠశాలలు తెరిపించి విద్య బోధన చెప్పాడన్నరు. 

సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ  3000 సంవత్సరాలుగా మెజారిటీ వర్గమైన 80% ప్రజలను అజ్ఞానానందకారంలో ఉంచి మనువాద బ్రాహ్మణ వర్గం పెత్తనం చేసింది. జ్యోతి రావు పూలే ఆధ్వర్యంలో బహుజన వర్గాలను చైతన్యవంతం చేసేందుకు సత్యశోధకు సమాజ్ ఆధ్వర్యంలో పాఠశాలలో నెలకొల్పి  జ్ఞానవంతులు చేసేందుకు   ప్రయత్నించాడు అన్నారు.

 చైతన్య వేదిక గౌరవ అధ్యక్షులు చిన్న భీమన్న  మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయు రాలు సావిత్రిబాయి పూలే దంపతులు  సొంత డబ్బులతో  సత్యశోధ సమాజా ఆధ్వర్యంలో మహిళా పాఠశాలలు నెలకొల్పారు. దీన్ని బ్రాహ్మణ మనువాద వర్గం ఎన్నో ఆటంకాలు కల్పించిన ఏరవక బహుజన జాతి చైతన్యం కోసం పాటుపడ్డారు అన్నారు. 

ఈ సందర్భంగా పూలే సావిత్రిబాయి జీవిత చరిత్రలపై  వ్యాసరచన ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో సీనియర్ విభాగంలో ప్రధమ బహుమతి షేక్ షహీన్, ద్వితీయ తృతీయ  శివాని, రశ్మిత.

 జూనియర్ విభాగంలో చంద్ర హస్య, అశ్విత, భావన, లు బహుమతులు గెలుచుకున్నారు.  ఈ కార్యక్రమంలో బహుమతులను ప్రధానం చేసిన సామాజిక చైతన్య వేదిక గౌరవ అధ్యక్షులు ఆకుల పోశం, బెల్లంపల్లి మండల ఎం21 అధ్యక్షులు కనకయ్య, రామ టెంకి రాజలింగులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.