మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఘనంగా దేవాపూర్ ఉన్నత పాఠశాలలో కాళోజి జయంతి కార్యక్రమం.

 ఘనంగా దేవాపూర్ ఉన్నత పాఠశాలలో  కాళోజి జయంతి కార్యక్రమం.

 కాళోజి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు 



Scv News Kasipet :--

 కాసిపేట మండలం దేవపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భాషా దినోత్సవం పురస్కరించుకొని  కాలోజి నారాయణరావు  జయంతి కార్యక్రమాన్ని సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు,సామాజిక చైతన్య వేదిక నాయకులు కాలోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు అంజాద్ పాషా కాళోజి  తెలంగాణ సమాజానికి చేసిన సేవలను, భాష అభివృద్ధి గురించి మాట్లాడారు. కాళోజి కవితలను, తెలుగు సాహిత్యం గురించి మాట్లాడారు. 

సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ కాలోజి నారాయణరావు, ప్రజల తరఫున  నాటి తెలంగాణ లో నైజాం ప్రభుత్వం రజాకార్ల దోపిడి  పాలన గురించి మాట్లాడారన్నారు. నైజాం ప్రభుత్వానంతరం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై సాగించిన రాచక పాలన ను కూడా విమర్శించాడన్నారు. తెలంగాణ యాస,బాషాలలో ప్రజలను చైతన్యవంతం చేసే ఎన్నో కవితలను ప్రజలను ప్రత్యేక తెలంగాణ సాధనకు ఉద్యమించేందుకు కృషి చేశాడు అన్నారు. తదనంతరం  నిర్వహించిన చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలలో ప్రథమ ద్వితీయ పోటీలలో  గెలుపొందిన ప్రీతి కుమారి, దీక్ష, మహిమలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో  పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు సురేష్ బాబు, ఉపాధ్యాయులు లచ్చన్న రమణయ్య సులోచన పద్మ, కుమారి రజిత రాజేష్ లు పాల్గొన్నారు.