బహుజన పోరాట యోధురాలు, తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి.
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలు సమర్పిస్తున్న జిల్లా రజక సంఘం గౌరవ అధ్యక్షుడు దావనపల్లి లక్ష్మణ్.
Scv News Kasipet:--
కాసిపేట మండలం కొండాపూర్ యాప చౌరస్తాలో ఈరోజు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమం రజక వృత్తిదారుల సంఘం, వివిధ కుల, ప్రజా, ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి జిల్లా రజక వృత్తి దారుల సంఘం గౌరవాధ్యక్షుడు దావన పెళ్లి లక్ష్మణ్ ఇతర ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దవనపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో రజక వృత్తి చేసుకునే పేద మహిళ దొరలను ఎదిరించి భూ పోరాటాలు చేసి తమ భూమిని దక్కించు కుందన్నారు. ఐలమ్మ రజక వృత్తిదారుల సంఘానికి ఆదర్శప్రాయం అన్నారు. తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పంద్రం హనుమంతు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ నైజాం కు వ్యతిరేకంగా సాగించిన భూ పోరాటం బహుజన వర్గాలకు ఎంతో ఊపునిచ్చిందన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో బహుజన కులాలన్నీ ఐక్యంగా తమ సమస్యల కోసం ఉద్యమించాలన్నారు.
సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ భూ పోరాటం కీలకమైంది అన్నారు. లక్ష ఎకరాల భూస్వామి విసునూరి రామచంద్రారెడ్డి జాగీర్దార్ తో భూమిని దక్కించు కునేందుకు రాజీ లేని పోరాటం చేసిన వీరనారి అని కొనియాడారు. బహుజన కులాలన్నీ ఐకమత్యంతో ఉండి మండలంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు.
మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ముత్యాల రాజమౌళి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ సాగించిన ఉద్యమాన్ని బహుజన కులాలమంతా స్ఫూర్తిగా తీసుకొని ఐకమత్యంతో ఉండా లన్నారు. ఆదివాసి సేన గౌరవాధ్యక్షుడు మడవి గంగారం మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బహుజన కులాలన్నీ ఏకమవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సంఘం మాజీ అధ్యక్షుడు దుర్గం పోశం, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కంది ధర్మయ్య, రాచకొండ శ్రీనివాస్, నేరెళ్ల రవి, భుక్య రవి బందెల వెంకట స్వామి, ఒల్లెపు రాజు తదితరులు పాల్గొన్నారు.