మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి..

 నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి..

 - సర్పంచి వేముల కృష్ణ



Scv News Kasipet:--

నైపుణ్య శిక్షణ పొందిన కార్మికులు నలుగురికి ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదగాలని *పెద్దనపల్లి సర్పంచి వేముల కృష్ణ కార్మికులను ఉద్దేశించి అన్నారు.* కార్మిక శాఖ  నేషనల్ అకాడమీ ఆఫ్ క్రాఫ్ట్ (NAC) ఆధ్వర్యంలో పెద్దనపల్లి గ్రామపంచాయతీలో కార్యాలయంలోని సమావేశ మందిరంలో 15 రోజులపాటు నడుస్తున్న నైపుణ్య శిక్షణ ముగింపు కార్యక్రమం పాల్గొని మాట్లాడారు.. ముందుగా శిక్షణ బృందాధికారి శంకర్ శిక్షణ పొందిన కార్మికులు సర్పంచ్ని ఘనంగా సన్మానించారు. శిక్షణ కొరకు కార్మిక శాఖ యందు పేరు నమోదు చేసుకుని మండల యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని, నైపుణ్య శిక్షణ పొంది వివిధ రంగాల్లో రాణించాలని కోరారు.