మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బదిలీ పై వెళుతున్న పెద్దనపల్లి పంచాయతీ కార్యదర్శి నాగరాజు ను,ఏఎన్ఎం పద్మ కు సన్మానం.

పెద్దనపల్లి  పంచాయతీ అభివృద్ధి లో కార్యదర్శి నాగరాజు పాత్ర క్రియాశీలం.-

- మాజీ సర్పంచ్ వేముల కృష్ణ.



బధిలి పై వెళుతున్న పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఏఎన్ఎం పద్మను  సన్మానిస్తున్న పంచాయతీ మాజీ సర్పంచి వేముల కృష్ణ , జడ్పిటిసి సభ్యుడు పల్లె చంద్రయ్య, ఎంపీటీసీ రామచందర్,వార్డు సభ్యులు.

Scv News Kasipet:--

 కాసిపేట మండలంలో  పెద్దనపల్లి పంచాయతీ లొ ఘనమైన అభివృద్ధి జరిగిందని అభివృద్ధిలో క్రియాశీల పాత్ర పంచాయతీ కార్యదర్శి నాగరాజు దైనని మాజీ సర్పంచ్ వేముల కృష్ణ అన్నారు. పెద్దనపల్లి గ్రామ పంచాయతీలో గత ఆరేళ్లుగా పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహించిన కె నాగరాజు, ఏఎన్ఎం పద్మలు బదిలీపై వెళ్తున్న సందర్భంగా  మాజీ గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ, మాజీ జడ్పిటిసి  పల్లె చంద్రయ్య, మాజీ ఎంపీటీసీ కొండ బత్తుల రామచందర్ ఆధ్వర్యంలో ఈరోజు పంచాయతీ కార్యాలయంలో సన్మానించారు. వీరితోపాటు  నూతన పంచాయతీ కార్యదర్శిగా వచ్చిన క్రాంతి కుమార్ ను కూడ సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి నాగరాజు గత అరేళ్లుగా పంచాయితీలో ని గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఏఎన్ఎం పద్మ కూడా  గ్రామస్తులకు వైద్య సేవలు అందించి ప్రజల అభిమానం పొందింది అన్నారు.

ఈ కార్యక్రమంలో  మాజీ ఉప సర్పంచ్ సోమని మైసక్క మాజీ వార్డు సభ్యులు కొత్త రమేష్,కంచర్ల పద్మ,పంబాల తిరుపతి గ్రామ పెద్దలు నారిశెట్టి వెంకన్న  చింతల రాజయ్య  జీదుల కనకయ్య,లవడం నవీన్,  సోమని రాజు, బోనేన్ రాజు, పల్లె ఎల్లయ్య,పల్లె రమేష్,వెళ్లి శ్రావణ్ బైరి శ్రీనివాస్, బన్న శ్రీనివాస్, కంచర్ల అనిల్, మరియు మండల ఆఫీస్ సిబ్బంది సీనియర్ సహాయకులు లక్ష్మీనారాయణ పంచాయతీ కార్యదర్శులు గ్రామపంచాయతీ సిబ్బంది సీలోజి మురళి, కాసిపేట మండల గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కటుకు దీపక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.