మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

గంజాయి బెల్టుషాపులను అరికట్టాలి




కాసిపేట మండలం లో గంజాయి విక్రయాలను అరికట్టాలి.

 మండల సర్వసభ్య సమావేశంలో పెద్దన పల్లి సర్పంచ్ వేముల కృష్ణ డిమాండ్



SCV News Kasipet :-

కాసిపేట మండలంలోని గ్రామాలలో విచ్చలవిడిగా  గంజాయి, గుడుంబా, బెల్టుషాపులు నడుస్తుండడం వల్ల  ప్రజలకు తీవ్ర అసౌకర్యం  కలుగుతుందని వీటిని  అరికట్టాలని పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వ  సభ్య సమావేశం లో  గ్రామాలలో అక్రమంగా నడుస్తున్న బెల్టుషాపులను అరికట్టాలని, గంజాయికి యువత, విద్యార్థులు అలావాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారాని ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకొని విచారణ  జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పెద్దనపెల్లి ఎంపీటీసీ కొండ బత్తుల రామ్ చందర్ జోక్యం చేసుకుంటూ ప్రతి  దానికి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని  మీ పంచాయతీ పరిధిలోని బెల్టుషాపులను నడవకుండా చూసుకోవాలని సర్పంచ్ కృష్ణ ను కోరారు. కో ఆప్షన్ సభ్యుడు శిరాజ్ ఖాన్  మాట్లాడుతూ  మండలంలో గంజాయి విక్రయాలు జోరుగానే ఉన్నాయని యువత వాటికి బానిసలై ఆనారోగ్యాల పాలవుతున్నారని పోలీసులు ఎక్సైజ్ అధికారులు అరికట్టాలని అన్నారు. సమావేశానికి హాజరైన ఎక్సైజ్ కానిస్టేబుల్  సమాధానం ఇస్తూ సిబ్బంది కొరత వల్ల ఎక్కువ తిరగలేక పోతున్నామని విషయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. ఎంపీడీవో ఎం ఏ అలీ మాట్లాడుతూ ఫిబ్రవరి 1 నుండి ప్రభుత్వ పాఠశాలలు పని చేస్తాయని అన్నారు. ఉపాధి హామీ, అంగన్వాడి, గ్రామీణ పేదరిక నిర్మూలన, విద్యాశాఖ, డీలర్ షిప్ లపై సంబంధిత అధికారులు నివేదికను చదివి వినిపించారు. వీటిపై సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులను ఎలాంటి ప్రశ్నలు అడగకు కుండ మౌనంగానే ఉన్నా రు. సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షురాలు రొడ్డ లక్ష్మి  అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జడ్పిటిసి పల్లె చంద్రయ్య, ఉపాధ్యక్షుడు విక్రమ్ రావు, ఎంపీడీవో  అలీమ్  ఎంపిటిసిలు సర్పంచ్లు పాల్గొన్నారు.