మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పల్లంగూడ, కొండాపూర్ గ్రామపంచాయతిలలో ప్రజా పాలన గ్రామ సభలు.

 పల్లంగూడ, కొండాపూర్  గ్రామపంచాయతిలలో ప్రజా పాలన గ్రామ సభలు.

 పల్లం గూడెం లో జరిగిన ప్రజా పాలన గ్రామసభ లో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు.

కొండాపూర్ పంచాయితీలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు.

Scv News Kasipet :--

 కాసిపేట మండలం పల్లం గూడెం కొండాపూర్ పంచాయతీలలో ఈరోజు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజల నుండి  మహాలక్ష్మి రైతు భరోసా గృహ జ్యోతి,ఇందిరమ్మఇండ్లు, చేయూత పథకాల కోసం దరఖాస్తులను పల్లం గూడెం సర్పంచ్ దుస్స విజయ, కొండాపూర్ సర్పంచ్ మక్కల శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో అధికారులు స్వీకరించారు. ఈ గ్రామ సభలలో మండల ప్రత్యేక అధికారి గంగారాం, తహసిల్దార్ భోజన్న, ఎంపీడీవో ఎంఏ అలీ పంచాయితీ అధికారి నాగరాజు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామ సభలలో  స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్,  మండల కాంగ్రెస్ నాయకులు, మెయిన్రపు రాజన్న , పుత్తూరు సత్తయ్య , రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.