మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ఘనంగా బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి కార్యక్రమం.

 మనువాదుల కుట్రలతో బహుజన పోరాట యోధుడు సర్వాయి పాపన్న చరిత్ర కనుమరుగు.

-- పల్లె మల్లయ్య, మోకు దెబ్బ మండల సలహాదారు.

 సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మోకు దెబ్బ, ప్రజా సంఘాల నాయకులు.



Scv News Kasipet:--

మనువాద చాతుర్  వర్ణ వ్యవస్థకు విరుద్ధంగా క్షత్రియుడికి బదులుగా బహుజనుడు రాజ్యమేలినందుకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర ను దేశ చరిత్రలోనే లేకుండా మనువాదులు  చేశారని  మోకు  దెబ్బ మండల సలహాదారు పల్లె మల్లయ్య అన్నారు. కాసిపేట మండలంలోని కొండాపూర్ చౌరస్తాలో మండల గౌడ సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ 374వ జన్మదినోత్సవ కార్యక్రమం  ఆదివారం మోకు దెబ్బ మండల అధ్యక్షుడు మార్క శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి మోకుదెబ్బ ప్రజాసంఘాల నాయకులు పూలమాల సమర్పించి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా మండల సలహాదారు  పల్లె మల్లయ్య మాట్లాడుతూ సర్వాయి పాపన్న 350 సంవత్సరాలకు పూర్వమే  దేశంలోనే మొదటిసారిగా  తెలంగాణలో బహుజన రాజ్యాన్ని స్థాపించిన యోధుడని కొనియాడారు. 40 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించిన యోధుడని అంతటి ఘన చరిత్ర కలిగిన పాపన్న చరిత్ర ను దేశంలోని మనువాద చరిత్రకారులు కనుమరుగు చేశారన్నారు. మనువాద చాతుర్వర్ణ వ్యవస్థ కు  వ్యతిరేకంగా బహుజన కులానికి చెందిన పాపన్న రాజ్యాధికారాన్ని చేయడాన్ని బ్రాహ్మణవాదులు జీర్ణించుకోలేక పోయారన్నారు. అందుకే పాపన్న చరిత్ర భావి తరాలకు తెలియకుండా చేశారన్నారు. దేశానికి వలస వచ్చిన ఆంగ్లేయుల పాలనలో  బ్రిటిష్ చరిత్రకారులు పాపాన్న చరిత్ర ను వెలికి తీశారన్నారు. పాపన్న  విగ్రహాన్ని లండన్ మ్యూజియంలో పెట్టడం వల్ల నేడు  బహుజన వర్గాలకు పాపన్న గురించి  తెలిసిందన్నారు. బహుజన యోధుడు పాపన్న స్ఫూర్తిగా తీసుకొని బహుజన రాజ్య స్థాపన కోసం ఎస్సి, ఎస్ టి, బీసీ మైనారిటీలమంతా ఏకం కావాలని అన్నారు. 

సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాబు మాట్లాడుతూ బహుజన  వర్గాలలో ఐక్యత లేకపోవడం వల్లే 85% ఉన్న మనపై  15% లేని అగ్రవర్ణాలు వందల సంవత్సరాలుగా పెత్తనం చెల్లాయిస్తున్నాయన్నారు. బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న ను ఆదర్శంగా చేసుకొని బహుజనులమంతా బానిసత్వాన్ని విడనాడి  ఐక్యతతో బహుజన రాజ్యం కోసం పోరాడాలన్నారు. 

సామాజిక చైతన్య వేదిక సలహాదారు  మద్దినేని చిన్న భీమయ్య  మాట్లాడుతూ బహుజన వర్గానికి చెందిన సర్వాయి  పాపన్న దొరలు పెత్తందారులను ఎదిరించి 40 సంవత్సరాలు పరిపాలించడం సామాన్యమైనది కాదన్నారు. పాపన్న  చరిత్ర భావి తరాలు గుర్తుంచు కునేందుకు గౌడ  కులస్తులంతా పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. 

ఆదివాసిసేన మండల అధ్యక్షుడు మడవి వెంకటేష్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న  బహుజన వర్గాన్ని ఏకతాటిపై తెచ్చి  పరిపాలన సాగించాడన్నారు.పాపన్న పోరాట స్ఫూర్తితో  ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల మంత్ర ఏకమై బహుజన రాజ్యానికి కృషి చేయాలన్నారు. 

తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు సండ్ర భూమయ్య  మాట్లాడుతూ  బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న జీవిత చరిత్రను బహుజను లంతా తెలుసుకోవాలన్నారు. పాపన్న పరిపాలనను  ఆదర్శంగా తీసుకొని బహుజన రాజ్య స్థాపన కోసం అందరం ఏకమవాలన్నారు. 

మండల కాంగ్రెస్ నాయకుడు  రాజమౌళి మాట్లాడుతూ బహుజన కులాలన్నీ ఏకమై  సర్వాయి పాపన్న  తెచ్చిన బహుజన రాజ్యసాధనకు కృషి చేయాలన్నారు. 

కార్యక్రమానికి వందన సమర్పణ చేసిన మండల మోకు దెబ్బ అధ్యక్షుడు మార్క శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న  ఆశయ సాధన కోసం బహుజన కులాల అంతా ఏకం అవ్వాలన్నారు. వచ్చే సంవత్సరం మండలంలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా పాపన్న జయంతి నిర్వహిస్తామని అన్నారు. 

ఈ కార్యక్రమంలో మండల ఐకాసా కన్వీనర్ సిలోజ్ మురళి, మండల గౌడ సంఘం సలహాదారులు నేరెల్లి బుగ్గయ్యగౌడ్,  కోడూరు గురువయ్య గౌడ్, కోడూరు  విద్యా సాగర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పోడేటి రాజా గౌడ్, సంయుక్త కార్యదర్శి తాటిపాముల  రాజబాబు గౌడ్, మండల యూత్ కమిటీ అధ్యక్షులు  కోయాడ అంజన్న గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రావణ్ గౌడ్, సంయుక్త  కార్యదర్శి తాటిపాముల సాయి కిరణ్ గౌడ్, కోశాధికారి బుర్ర ప్రకాష్ గౌడ్, సి కాసిపేట, ధర్మారావుపేట మల్కపల్లి, కొండాపూర్, గ్రామ కార్యదర్శులు  మార్క మహేష్ గౌడ్, నేరెళ్ల రవి గౌడ్, తాటి పాముల సాయి కిరణ్ గౌడ్ లతో పాటు మండల గ్రామ గౌడ సంఘ సభ్యులంతా పాల్గొన్నారు.