ప్రజల కోసం ఉద్యమించిన నేతలు ప్రజల గుండెల్లో అమరులుగా చిరస్థాయిగా ఉంటారు.
![]() |
రోడ్డ చిన్న రమేష్ కు నివాళులర్పిస్తున్న ఆదివాసి ప్రజా సంఘాల నాయకులు. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం దేవపూర్ పంచాయతీలో ని నాయకపు గూడెంలో ఆదివాసి హక్కులు, సమస్యల పరిష్కారం కోసం కృషిచేసి అసువులు బాసిన రోడ్డ చిన్న రమేష్ 4వ వర్ధంతి కార్యక్రమం ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంఘ నాయకులు,కుటుంబ సభ్యులు ఆదివాసి సాంప్రదాయం ప్రకారం ఇంటి నుండి డప్పు వాయిద్యాలతో గ్రామ శివారులో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన శిల విగ్రహం, సమాధి వరకు ఊరేగింపు గా వెళ్లారు. విగ్రహం వద్ద జెండాను ఎగరవేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డ చిన్న రమేష్ ఆదివాసి హక్కులు, సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటాలను తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి ఆడే జంగు, నాయక్ పోడ్ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాపు, సామాజిక చైతన్య వేదిక సలహాదారు చిన్న భీమయ్య , నాయక్ పోడ్ సేవా సంఘం మండల అధ్యక్షుడు బద్ది శ్రీనివాస్ వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో గంజి రాజన్న(ఆదివాసీ నాయకపొడ్ హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు)సిడం శంకర్ (తుడుందెబ్బ ఉపాధ్యక్షులు)పెందోర్ ప్రభాకర్ ( అదివాసీ సేన ఉపాధ్యక్షులు)అత్రం మహేష్ ( తుడుందెబ్బ కార్యదర్శి)సోయం సూరు (కార్మిక సంఘం నాయకులు)రొడ్డ రాజయ్య(గ్రామపెద్ద)రొడ్డ లచులు (పూజారి )కలవెని శ్రావణ్ (గ్రమకమిటి కోశాధికారి)రెడ్డి లక్ష్మణ్ ( సంస్కృతిక కార్యదర్శి )బద్ది మల్లికార్జున్ (ఉద్యోగస్తులు)ఆదివాసీ మహిళలు మరియు యువకులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది.