ఆదర్శ ఉపాధ్యాయుడు మొండయ్య సార్ కు సాలెగూడా గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు.
![]() |
సాలే గూడెం ఉపాధ్యాయుడు మొండయ్యను సన్మానిస్తున్న గ్రామస్తులు |
Scv News Kasipet :-
కాసిపేట మండలం గట్రావ్ పల్లె పంచాయతీ పరిధిలో సాలె గూడెం గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి బదిలి పోయి వెళ్తున్న మొండయ్యను, ఆదివాసి యువత గ్రామ మహిళా సంఘాలు శనివారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా స్థానిక ఆదివాసి నేత ప్రభాకర్ మాట్లాడుతూ సాలెగూడ గ్రామంలో 12 సంవత్సరాలు మొండయ్య సార్ ఉపాధ్యాయ వృత్తి చేస్తూ పిల్లలకు విద్యాబోధనతో పాటు గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రత, గ్రామంలో ఐకమత్యంగా ఉండి గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో బోధించే వాడని అన్నారు.మాలో ఒకరిగా ఉంటూ ప్రతి ఒక చిన్న పెద్ద కార్యక్రమలో అందరితో పాలుపంచు కుంటూ నా ఊరు అని భావించి పిల్లలతో పెద్దలతో మమేకమై గౌరవంగా కలిసి మెలిసి ఉన్న గొప్ప ఉపాధ్యాయులు వారు పిల్లలకు చదువు నేర్పిస్తూ. ఊరు పెద్దలకు మంచి కొరకు సూచనలు, సలహాలు చెప్పడం జరిగేది.అందుకు మీరు ఎక్కడ ఉన్నా అండగా ఉండాలని అన్నారు .
నాయక్ పోడ్ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కోమ్ముల బాపు మాట్లాడు తూ ఆదర్శ భావాలు సామాజిక స్పృహ ఉన్న మొండయ్య లాంటి ఉపాధ్యాయు లు మారుమూల గిరిజన గ్రామాలకు ఎంతో అవసరం అన్నారు. ఇలాంటి ఉపాధ్యాయుల బోధనలో, విద్యార్థులు, గ్రామస్తులు సన్మార్గంలో ప్రయాణిస్తారన్నారు. తదనంతరం గ్రామస్తులు, మహిళా సంఘాలు, ఉపాధ్యాయులు మొండయ్యను శాలువాతో ఘనంగా సన్మానించారు . తదనంతరం ఉపాధ్యాయుడిని గ్రామంలో ఊరేగించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు M వాసుదేవ్, రమేష్ CRT,సుగుణ, తానుజ PS. కొమ్ముల బాపు నాయకపొడ్ సేవా సంఘం రాష్ట్ర నాయకులు. గ్రామ యువత మహిళలు ప్రజలు అందరూ పాల్గొనడం జరిగింది.