మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసి పేట మండలంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం.

 గిరిజన సంఘాల ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లోని కుమరం భీం విగ్రహాల వద్ద ఆదివాసి జెండాను ఎగురవేత.

 మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ చిత్రాలు.

Scv News Kasipet :--

 కాసిపేట మండలంలో వివిధ గ్రామాలలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల తుడుం దెబ్బ, ఆదివాసి సేన, నాయాక్ పోడ్  సేవా సంఘం ఆధ్వర్యంలో సాలె గూడెం,దేవాపూర్, రొట్టె పెల్లి, కొండాపూర్ యాప, గ్రామాలలో ఉన్న కొమరం భీం విగ్రహాల వద్ద గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ఆచారాల ప్రకారం, గిరిజన సంఘాల నాయకులు ఆకుపచ్చ జెండాను ఎగురవేశారు. అనంతరం మండల కేంద్రంలో జెండాను ఎగురవేసి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలి వెళ్లారు.