ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా గిరిజన గ్రామాల్లో ఎగురవేయాలని గిరిజన సంఘాల నాయకుల పిలుపు.
![]() |
ఆదివాసి దినోత్సవ నిర్వహణ కమిటీ సమావేశం లో పాల్గొన్న గిరిజన సంఘాల నాయకులు. |
Scv news kasipet :--
కాసిపేట మండలం మద్దిమాడ గ్రామపంచాయతీ పరిధిలోని సల్ఫల వాగు వద్ద ఈరోజు మండలంలోని ఆదివాసి సంఘాలతో సమావేశం అయ్యాయి. ఈ నెల 9వ తేదీన జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలని చర్చించారు. గిరిజన గ్రామాలలో ఉదయం 8 గంటలకు ఆకుప చ్చ జెండాను గిరిజన సంఘాల బాధ్యులు ఎగురవేయాలని, తదనంతరం దేవాపూర్, కొండాపూర్ లలో జరిగే జెండా వందన కార్యక్రమానికి నాయకులంతా హాజరై 9 గంటలకు మండల కేంద్రంలో ఆదివాసి జెండాను ఎగురవేయాలని తీర్మానించారు.
తదనంతరం మండలం కేంద్రం నుండి ఊరేగింపుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ని వైశ్య భవన్ లో జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవంలో పాల్గొనాలని తీర్మానించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రపంచ ఆదివాసి దినోత్సవ నిర్వహణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు.
నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా మడవి వెంకటేష్, ఉపాధ్యక్షులు సండ్ర భూమయ్య, మడావి గోపాల్, మడావి మధుకర్, ప్రధాన కార్యదర్శిగా ఆత్రం మహేష్ కార్యదర్శులుగా ఆడ శ్రీనివాస్, పంద్రం ప్రభాకర్ లను ఎన్ను కున్నారు. సలహాదారుల గా పెద్రం హనుమంతు,వెడ్మ కిషన్, ఆత్రం జంగు, మడవి గంగారం, ఆడ జంగు, శంకర్ లను ఎన్నుకున్నారు.