మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

గిరిజన నాయకుడు పెద్దల లక్ష్మణ్ కు నివాళులు.

పెద్దల లక్ష్మ న్ నాయకపోడ్ సేవా సంఘం అభివృద్ధికి ఎనలేని కృషి చేశాడు.

-- కొమ్ముల బాపు నాయక్ పోడ్ సేవా సంఘం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


Scv News kasipet :--

కాసిపేట మండల కేంద్రంలోని దేవాపూర్ పంచాయతీ పరిధి ఓరియంట్ సిమెంట్ కాలనీలో ఈరోజు ఆదివాసి అమరుడు కీర్తిశేషులు పెద్దల లక్ష్మణ్  మూడవ వర్ధంతి సందర్భంగా ఆదివాసి నాయక పోడు సేవ సంఘం కాసిపేట మండల కమిటీ దేవపూర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శ కొమ్ముల బాపు మాట్లాడుతూ ఆదివాసి నాయక పోడు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శిగా మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడిగా దేవాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఉండి జాతి చైతన్యం కోసం సంస్కృతి సాంప్రదాయాలు ముందుకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించా డని ఆయన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో భీమిని మహేందర్ మండల ఉపాధ్యక్షులు, రొడ్డ రవీందర్ కోశాధికారి, రెడ్డి లక్ష్మణ్ సాంస్కృతిక కార్యదర్శి,రోడ్డ అనిల్ గాంధారి ఖిల్లా దేవాలయ కమిటీ ఉపాధ్యక్షులు, గడ్డం భీమయ్య దేవాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు, బద్ది శ్రీనివాస్ కోశాధికారి, కొమ్ముల రామ్ చందర్ యూత్ అధ్యక్షులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.