మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మండల ప్రజల అవస్థలు గుర్తించి రహదారిపై గుంతలు పూడ్చేందుకు ధర్నా చేసిన గిరిజన, ప్రజా సంఘాల నాయకులకు scv News ప్రత్యేక అభినందన లు.

ప్రజా సమస్యల పై స్పందించి పరిష్కారం కృషి చేసిన వారే నిజమైన ప్రజానాయకులు.

 కొండాపూర్ చౌరస్తాలో మండల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న గుంతలు పూడ్చాలని ప్రజా సంఘాలు గిరిజన సంఘాల ఆందోళన.
 కొండాపూర్ చౌరస్తాలో ప్రయాణికులను ఇబ్బందికి గురి చేస్తున్న గుంతల పరిస్థితి ఇలా ఉంది.
Scv News Kasipet:--

ప్రజల కోసం పరితపించి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసే వారే  నిజమైన ప్రజా నాయకులుగా ప్రజల మన్ననలు పొందుతారు. తమ ముందు ప్రజలు అవస్థలు పడుతున్న పట్టించుకోకుండా 'ఎవరు ఎక్కడ పోయినా నాకేంటి అంటూ గ్రామాల్లో నాయకులుగా చలామణి అయ్యే వారిని ప్రజా వ్యతిరేకులుగానే ప్రజలు గుర్తిస్తారు.

 కాసిపేట మండలం కొండాపూర్ చౌరస్తాలో గత మూడు సంవత్సరాలు గా డ్రైనేజీ లో నుండి వెళ్లాల్సిన వర్షపు నీరు  డ్రైనేజీలు  ఆక్రమణలకు గురై  రహదారి పైకి వచ్చి రోడ్డంతా గుంతల మాయమైంది. గుంతలపై ప్రయాణించి  వాహనదారులు  వర్షాకాలంలో  తీవ్ర ఇబ్బందులకు గురైన అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజాసంఘాల నాయకులు పట్టించుకోవడం లేదు. ప్రజలు కట్టే పన్నులతో వేతనాలను తీసుకుని  ప్రజల సమస్యలను పరిష్కరించి, సంక్షేమ పథకాలను ప్రభుత్వం యంత్రాంగం ప్రజల గోసలను పట్టించుకోవడం లేదు. సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు  తమ విధులను సక్రమంగా నిర్వర్తించక మొద్దు నిద్ర లో ఉన్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి . వర్షాకాలంలో గుంతల్లో పడి అవస్థలు పడుతున్న ప్రయాణికుల గురించి మీడియా వార్తా కథనాలు ఇస్తున్న వాటిని పట్టించు కోకుండా 'దున్నపోతు మీద వర్షం పడ్డ రీతిలో' అధికార యంత్రాంగం వ్యవహరిస్తుందనే  విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

 గత మూడు సంవత్సరాల తర్వాత కొండాపూర్ చౌరస్తా లోని గుంతలపై ప్రజలు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకొని సామాజిక స్పృహతో ఎట్టకేలకు ప్రజా సంఘాలు,గిరిజన సంఘాలు స్పందించడం పట్ల సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది. 

రోడ్డు మీద పడ్డ వర్షపు నీరు డ్రైనేజీల గుండా గత 30 సంవత్సరాలుగా వెళ్లడంతో ఇలాంటి సమస్య తలెత్తలేదు. కాల్వ వెనుక ఇల్లు నిర్మించుకుంటే ముందు పైపులు వేసుకోవాలని  కనీస స్పృహ లేని కొందరి వల్ల ఈ సమస్య తలెత్తింది.  డ్రైనేజీ నీరు, వర్షపు నీరు వెళ్లే పైపులైనుకు అడ్డంగా ఇండ్లు నిర్మించుకోవడం, ప్రభుత్వం లక్షలాది రూపాయలతో నిర్మించిన డ్రైనేజీలను కూల్చి వేయడంతో సమస్య ఉత్పన్నమైంది. డ్రైనేజీ ముందు ఆక్రమణలు తొలగించే బాధ్యత కలిగిన పంచాయితీ, ప్రజా ప్రతినిధు లు, అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో సమస్య తీవ్ర రూపం దాల్చింది.

 వర్షపు నీరు వెళ్లే విధంగా డ్రైనేజీల ముందు కాలువ తీయాలని డ్రైనేజీల ఆక్రమణలు తొలగించాలని గత మూడు సంవత్సరాలుగా ప్రజా మీడియా  'Scv News సోషల్ మీడియా' ఒంటరి పోరు నిర్వహిస్తుంది. ఏ పత్రికలలో, మీడియాలో రాని విధంగా  గుంతలు  ఏర్పడడానికి కారణం, దాని పరిష్కారం పై విశ్లేషణాత్మక కథనాలు ఇవ్వడం జరిగింది. కొండాపూర్ పంచాయతీ అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు అధికారులు, వివిధ రాజకీయ ప్రజాసంఘాల నాయకులు స్పందించక నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

 మూడు సంవత్సరాలుగా భారీ వర్షాలతో వర్షపు నీరంతా రోడ్డు మీదనే చేరడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణికులకు తీవ్ర అవస్థలకు గురిచేస్తుంది. ఇటీవల ఏర్పడిన గుంతల్లో ద్విచక్ర వాహనాలు పడి చాలామంది గాయాల పాలయ్యారు. డ్రైనేజీలను కబ్జా చేసిన వారు  వివిధ రాజకీయ పార్టీల నాయకులు కావడం తో అక్రమణాలు తొలగించడానికి అధికార యంత్రాంగం  సాహసించడం లేదు.

 ప్రజల అవస్థలు గమనించి దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు ఓరియంట్  యాజమాన్యంతో మాట్లాడి తాత్కాలిక ఉపశమనం కోసం రెండు సంవత్స రాలుగా రోడ్డుమీద పడ్డ గుంతలను  పూడ్చడం  జరుగుతుంది.గుంతలు పూడ్చేఎందుకు  మండలంలోని అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులకు, ప్రజా సంఘాల నాయకులు ప్రయత్నించ కపోవడం శోచనీయం.

 అధికార పార్టీ, వివిధ రాజకీయ పార్టీ ప్రజాసంఘాల నాయకుల తీరు దారుణం..

 గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు  అందించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం తమ విధులు విస్మరించాయి. గత మూడేళ్లుగా వర్షాకాలంలో రహదారిపై ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడి గుంతల నుండి వెళ్లి వాహనాలపై కిందపడి తీవ్ర గాయాల పాలవుతున్న పట్టించుకోవడం లేదు. కనీసం రహదారిపై నీరు ఎందుకు నిలుస్తుంది? దీనీ పరిష్కారం మార్గం ఎలా?. అని కూడా గత బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ పాలకులు డ్రైనేజీ వద్ద ఆగి చూడకపోవడం విచారకరం. 

తెలంగాణలో ప్రజా పాలన తెస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాసమస్యలు పక్కకు పెట్టి మండలములో పార్టీ గ్రూపు తగాదాలకే పరిమితమైంది. నిధుల కొరత ఉందని నాయకులు సాకులు చెప్తున్నారు. మండల ప్రజలందరికీ ఇబ్బందులు కలిగిస్తున్న రహదారిపై గుంతల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని వద్ద పది లక్షల నిధులు లేవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ వద్ద అత్యవసర పనులు చేపట్టేందుకు కోట్లాది రూపాయల అత్యవసర నిధులు ఉంటాయి. అధికారపార్టీ నాయకులు చిత్తశుద్ధితో ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకు వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది. 

 కొండాపూర్ పంచాయతీ యువత   కళ్యాణ్ బిర్యాని హోటల్ తొలగించేందుకు తీసుకున్న శ్రద్ద, గ్రామంలోని రహదారిపై వున్నా గుంతల సమస్య పరిష్కారంలో లేదు. 

కొండాపూర్ పంచాయతీలో పంచాయతీ అధికారితో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు  స్థానిక యువత గుంతల సమస్యను గత మూడేళ్ళగా స్పందించకపోవడం విచారకరం. గత రెండు సంవత్సరాలు గా రోడ్డు మీద పడ్డ వర్షం నీరు మూడు పేద కుటుంబాల ఇండ్ల నుండి వెళుతు ఇంటి సామాగ్రి కొట్టుకుపోయి  రాత్రుల్లో జాగారాలు చేసిన వీరికి పట్టింపు లేదు. మానవతా దృక్పథంతో తమ వారి  ఇండ్లలోకి నీరు వచ్చి బాధపడుతు న్నారన్న కనీసం మానవత్వం లేకుండా జీవిస్తున్నారు. ఒక్కరోజు రోడ్డుమీదికి నీరు ఎందుకు వస్తుంది.? దీనికి కారకులు ఎవరు? దీన్ని శాశ్వతంగా పరిష్కరించాలన్న  ఆలోచన వారిలో లేదు.  గ్రామ సమీపంలో  ప్రభుత్వ అనుమతులతో  పొట్టకూటి కోసం దేవాపూర్ కు చెందిన ఒక ముస్లిం వృద్ధుడు కళ్యాణి బిర్యాని హోటల్ పెట్టుకుని జీవిస్తున్నాడు. పట్టణాలలో వేలాది కళ్యాణ్ బిర్యాని హోటల్ నడుస్తున్నాయి. హోటల్ నడపడం వల్ల తమ కేదో నష్టం వాటిల్లుతుందని కనీస మానవత్వం లేకుండా నిరుపేద ముస్లిం వృద్ధుడి హోటల్ ను బలవంతంగా పంచాయతీ అధికారులతో మూసివేసేందుకు మాత్రం స్పందించారు. 

మన ఊరిలో రోడ్డుపై గుంతలలో నిత్యం పదుల సంఖ్యలో ప్రజలు గుంతల్లో పడి గాయాలపాలవు తున్నారు. అవస్థలు పడుతున్న  ప్రయాణికులు ఈ గ్రామంలోని యువత ఏం చేస్తున్నారు? రోడ్డుమీదికి డ్రైనేజీ రాకుండా చూసేవారే లేరా? అంటూ ఊరి వారినంత తిట్టుకుంటూ వెళ్తున్న వీరికి సోయి రావడం లేదు. కళ్యాణి బిరియాని హోటల్ వల్ల  మనకు ఏదో నష్టం జరిగిందని మన ధర్మం కు అపచారం జరిగిందంటూ కులం, మతాలను రెచ్చగొడుతు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ లు పెడుతూ వారి అజ్ఞానాన్ని ప్రదర్శించు కుంటు మానవత్వాన్ని మర్చిపోతున్నారు. 

 బహుజన వర్గాల యువత సామాజిక స్పృహ కోల్పోయి గ్రామాల్లో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా మందు విందు పార్టీలతో జల్సాలకే పరిమితం కావడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్న మవుతున్నాయి. 

 ఎట్టకేలకు మండలంలోని ఆదివాసి ప్రజాసంఘాల నాయకులు స్పందించి రహదారి గుంతలు పూడ్చేందుకు ముందుకు రావడం పట్ల మండల ప్రజల తరఫున సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా గ్రూప్ ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది. 

 ప్రజాసంఘాల ఐక్యవేదికతో ప్రజా సమస్యలపై ఉద్యమించాలి.

మండలంలోని అధికార,ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఇలాంటి ప్రజా సమస్యలను గుర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం షరామాములే. దశాబ్దాలుగా మండల అభివృద్ధి విఘాతానికి  అగ్రకుల నాయకత్వం ప్రధాన కారణం. అగ్రకుల  నాయకు లంతా ప్రజా సమస్యలపై స్పందించ కుండా  తమ స్వార్ధ ప్రయోజనాల కొరకు మాత్రమే పని చేస్తున్నారు. బహుజన వర్గాలలోని కొంతమందిని చేరదీసి చెంచాలుగా మార్చుకొని పాలన కొనసాగి స్తున్నారు. దేశ జనాభాలో 85% ఉన్న బహుజన వర్గాలు ఆలోచించాలి. బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ హక్కులతో, తమ ఓటును తాము వేసుకునే చైతన్యం మనలో వచ్చి బహుజన రాజ్య స్థాపనతోనే సమస్యలు పరిష్కారం అవుతాయి.

 మండలంలోని గ్రామాల ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సామాజిక స్పృహతో ఉన్న నాయకులంతా   ఏకమవ్వాల్సినా అవసరం ఉంది. మండలంలోని ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి రాజకీయాల కతీతంగా  గ్రామాలలో తక్షణం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై, ప్రభుత్వం ను నిలదీస్తూ ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా కోరుతుంది.

( ముఖ్య గమనిక  : scv News Kasipet సోషల్ మీడియాలో గత మూడు సంవత్సరాలుగా కొండాపూర్ చౌరస్తాలో డ్రైనేజీ ఆక్రమణల వల్ల గుంతలు ఏర్పడి ప్రజలు పడుతున్న ఇబ్బందులపై వార్తా కథనాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి కొంతమందికి నచ్చడం లేదు.  కొందరు చేసిన తప్పిదాలతో మండల ప్రధాన రహదారిపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇబ్బందులకు గురయ్యే వారంతా మౌనంగా ఉంటే తప్పుడు పనులు చేసే వారంతా గర్వంగానే సమాజంలో తిరుగు తుంటారు. మన మౌనమే వారి బలం. తమ కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే చైతన్యం మనలో రావాలి. 'ఎవరు ఎక్కడ పోతే నాకేంటి. నేను సుఖంగా ఉంటే చాలు అనే మనస్తత్వం ఉన్నంతవరకు మన బహుజన వర్గం బాగుపడదు. సోషల్ మీడియా అనేది ప్రజల  మీడియా మేమిచ్చే కథనాలు నిజమా? అబద్దమా? మండల ప్రజలు మీ మీ వాట్సప్పు గ్రూపులో కామెంట్లు పెట్టగలరని మనవి.)