కాసిపేట మండలం కొండాపూర్ చౌరస్తాలోని మండల ప్రధాన రహదారి పైన గుంతలు ఏర్పడి గత మూడేళ్లుగా వాహనదారులు అవస్థలు పడుతున్న పట్టించుకోకుండా నాయకులు మౌనం పాటించడం పట్ల మండలవాసులు ఆగ్రహం.
![]() |
కొండాపూర్ చౌరస్తాలో ఈరోజు సాయంత్రం కురిసిన వర్షానికి గుంతల రహదారిపై అవస్థలతో వెళుతున్న వాహనదారు లు. |
Scv News Kasipet:--
గ్రామాలలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వివిధ రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాల నాయకులు తమ విధులు విస్మరిస్తున్నారు. నాయకులుగా చలామని అయ్యేవారు ఆయా గ్రామాల్లోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తేనే ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉంటుంది. కళ్ళ ముందు కనిపించే ప్రజా సమస్యలను పట్టించు కోకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలను వాడుకునే నాయకులను ప్రజలు చీకొడతారు.
కాసిపేట మండలంలో గత మూడేళ్లుగా మండల ప్రజల ప్రధాన సమస్యను పట్టించుకోకుండా 'ఎవరు ఎక్కడ పోతే నాకేంది. నేను సుఖంగా ఉంటే చాలు' అంటూ మౌనం వహించే వివిధ రాజకీయ పార్టీల నాయకులు సిగ్గుపడాలి అంటూ మండల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాసిపేట మండల కేంద్రం ప్రధాన రహదారి, నిత్యం వందలాది వాహనాలు, ద్విచక్ర వాహనాలు వెళ్తుంటాయి. మండలంలోని అన్ని గ్రామాలకు వెళ్లే ప్రధానమైన కూడలి కొండాపూర్ చౌరస్తా .దేవాపూర్, సోనాపూర్ నుండి సోమగూడెం వరకు వెళ్లే రోడ్లు భవనాల శాఖ ప్రధాన రహ దారి అది. మండల ప్రజలంతా ప్రయాణించే మండల ప్రధాన రహదారి ని కొంతమంది స్వార్థపరులు తమ స్వలాభాల కోసం రహదారిని డ్రైనేజీగా మార్చారు. రహదారిపై వర్షపునీరు నిలిచి పెద్దపెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు గుంతలో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. నిత్యం అదే రహదారిపై ప్రయాణించే మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు మాకేం సంబంధం లేదు అన్న రీతిలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత మూడు సంవత్సరాల క్రితం సుమారు కోటి రూపాయల వ్యయంతో మండల ప్రధాన రహదారిపై బీటీ వేసిన కూడా కొంతమంది నిర్వాకం వల్ల రోడ్డుపై నీరు నిలిచి గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు మొత్తం రహదారిపైనే నిలిచి ప్రయాణికులకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వర్షపు నీటితో నిలిచిన రహదారి గుంతల్లో పడి ద్విచక్ర వాహన దారులు ప్రమాదాలకు గురవు తున్నారు.
పట్టించుకోని అధికార పార్టీ లు
కొండాపూర్ చౌరస్తాలో గత మూడు సంవత్సరాలుగా రహదారిపై నీరు నిలిచి గుంతల మయం అవుతుంది. గత 20సంవత్సరాలుగా వర్షపు నీరు రహదారి కింది నుండి డ్రైనేజీల ద్వారా వెళ్ళేది. వివిధ పార్టీలలో నాయకులుగా చలామణి అయ్యే వారు తమ బుద్ధిహీన చర్యల వల్ల ప్రజలకు ఇబ్బందిక కర పరిస్థితి ఎదుర వుతాయనే స్పృహ లేకుండా డ్రైనేజీలను కూల్చి అక్రమ నిర్మాణాలు చేశారు. దీంతో మూడు సంవత్సరాలు గా ప్రధాన రహదారిపై వెళ్లే వాహనదారులు తీవ్ర అవస్థలు గురవుతున్నారు. పైగా డ్రైనేజీలపై అక్రమ నిర్మాణం చేసిన నాయకులే 'దొంగే,దొంగ దొంగ 'అన్న రీతిలో తమ తప్పులు ఏమి లేవు అంటూ బుఖాయించ డం, వేరే డ్రైనేజీ నిర్మించాలంటూ ప్రభుత్వ అధికారులనే దబాయిస్తున్నారు. డ్రైనేజీ ని కూల్చిన వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులకు ధైర్యం చాలడం లేదు.
గత మూడేళ్లుగా ప్రజల పక్షాన నిలిచే 'సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా' వివిధ పత్రికలలో రహదారిపై నీరు నిలిచి మండల ప్రజలు పడుతున్న అవస్థలపై కథనాలు ఇస్తూనే ఉన్నాయి. దీనిపై మండలంలోని అధికార పార్టీ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్పందించి సమస్య పరిష్కారం కోసం కృషి చేయకపోవడం శోచనీయం. ప్రతి వర్షాకాలం రోడ్డుమీదికి నీరు ఎలా వస్తుంది అని చూసే ఓపిక ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు లేకపోవడం బాధాకరం. ఈ గుంతలకు తామే కారణమని వాహనదారులు గుంతల్లో పడి గాయాల పాలవుతు న్నారని ఆ నాయకులు కనీసం బాధపడకుండా తమ బిల్డింగుల ముందు నిలబడి చోద్యం చూస్తుండడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించలేని అధికార పార్టీ నాయకులు.
ఎన్నికల సమయంలోగ్రామాలలోని ప్రధాన సమస్యలను పట్టించుకోని పరిష్కరించాల్సిన అధికారపార్టీ ల నాయకులు ప్రజాప్రతినిదులు గత మూడేళ్లుగా పట్టించుకోవడం లేదు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో డ్రైనేజీ నిర్మాణానికి డీఎంఎఫ్టి నిధులు మంజూరయ్యాయని త్వరలో పనులు చేపడతామని అధికార పార్టీ నాయకులు అధికారంలోకి రాగానే మరచిపోతున్నారు. మాజీఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బూటకపు హామీలు ఇచ్చి గ్రామస్తులను మోసం చేసి ఎన్నికల్లో ఓడిపోయారు.
రహదారి గుంతలు పూడుస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూడా తమ హామీ నెరవేర్చడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మండల ప్రజలకు అవస్థలు కలిగిస్తున్న ప్రధాన సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే వద్ద ఉండే అత్యవసర నిధుల నుండి 10 లక్షల నిధులు మంజూరు చేయిస్తే పరిష్కారం అవుతుంది. స్థానిక గ్రామ ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఎమ్మెల్యే అనుచరుడు మండల కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.
దేవాపూర్ ఎస్సై చొరవతో గుంతలు పూడ్చడం వల్ల వాహనదారులకు కొంత ఊరట!
రహదారిపై నిలిచిన నీటి వల్ల గుంతలు ఏర్పడి వాహనాలు అందులో పడి ప్రయాణికులు గాయాల పాలవుతున్న సంఘటనలకు చలించి మానవతా దృక్పథంతో దేవాపూర్ ఎస్ఐ ఆంజనేయులు ఓరియంట్ యాజమాన్యంతో మాట్లాడి రెండు సార్లు గుంతలు పూడిపించారు. వర్షాలు కురవకుండా పొడిగా ఉన్నప్పుడు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా కొంత ఊరట కలిగిస్తుంది. వర్షం పడితే మళ్లీ గుంతలు ఏర్పడ వాహనదారులు అందులో పడి గాయాల పాలవుతున్నారు.
రహదారి గుంతల సమస్య శాశ్వత పరిష్కారం ఇది!
రోడ్లు భవనాల శాఖ రోడ్డు కింద నిర్మించిన పైపులైన్ నుండి వర్షపు నీరు వెళ్లేలా ఉన్న అడ్డంకులను తొలగించాలి. తరువాత యాప చౌరస్తా నుండి వచ్చే వర్షపు నీరును రోడ్డు మీదికి రాకుండా గతంలో మూడు లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన డ్రైనేజీ లోనికి పంపించాలి. డ్రైనేజీని కూల్చి అక్రమ నిర్మాణాలు చేసిన వాటిని తొలగిస్తే రహదారి గుంతల సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది.
దీనిపై మండలంలోని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వ అధికారుల అండతో పరిష్కరించాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా మండల ప్రజల తరఫున కోరుతుంది.