వారం రోజుల్లోగా శాశ్వత పరిష్కారం చేయకుంటే పెద్ద ఎత్తున మండల ప్రజలతో ఆందోళన చేస్తామని ప్రజా సంఘాల నాయకులు అధికారులకు హెచ్చరిక.!
కాసిపేట మండలం కొండాపూర్ చౌరస్తా లో గుంతలు పూడ్చాలని ఆదివాసి ప్రజాసంఘాల నేతల ఆందోళన.
Scv News Kasipet:--
కాసిపేట మండలం కొండాపూర్ చౌరస్తాలో గత మూడు సంవత్సరాలుగా డ్రైనేజీలను ఆక్రమించడంతో రహదారిపై నీరు నిలిచి వర్షాకాలంలో వాహనదారులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. దీనిపై స్పందించిన మండల ఆదివాసి, ప్రజాసంఘాలు ఆదివాసి సేన, తుడుం దెబ్బ, నాయక్ పోడ్ సేవా సంఘం, సామాజిక చైతన్య వేదిక నాయకులు ఈ రోజు రహదారిపై గుంతలు పుడ్చాలని, డ్రైనేజీల ఆక్రమణ తొలగించి శాశ్వత పరిష్కారం చేయాలని రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయక్ పోడు సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,సామాజిక చైతన్య వేదిక మండల ప్రధాన కార్యదర్శి, కొమ్ముల బాపు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా రోడ్డు కింది నుండి డ్రైనేజీ నీరు వెళ్లకపోవడం వల్ల రోడ్డుపై నీరు నిలిచి గుంతల మయం అవుతుంది. పంచాయితీ ప్రభుత్వ అధికారులు, పట్టించుకో కోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. మండలాధి కారులు ప్రజాప్రతినిదులు స్పందించి సమస్య పరిష్కరించా లన్నారు.
మండల ఆదివాసి సంఘం అధ్యక్షుడు మడావి వెంకటేష్ మాట్లాడుతూ వర్షాకాలంలో గుంతల రహదారిపై పడి గాయపడుతున్న అధికారులు ప్రజా ప్రతినిధులు గుంతలు పూసల లేదన్నారు.రహదారిపై వర్షపు నీరు రాకుండా డ్రైనేజీల నుండి వెళ్లేందుకు అడ్డంకులు తొలగించాలన్నారు.
సామాజిక చైతన్య వేదిక సలహాదారు చిన్న బీమయ్య మాట్లాడుతూ గత మూడేళ్లుగా రహదారిపై గుంతలతో మండల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతు న్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే స్పందించి పరిష్కరించకపోవడం శోచనీయం అన్నారు. వారం రోజుల్లోగా గుంతలు పూడ్చి శాశ్వత పరిష్కారం చేయకుంటే మండలంలోని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రహదారిపై కూర్చుని ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు రాస్తారోకో నిర్వహిస్తున్న ఆదివాసి సంఘాల నాయకులకు నచ్చచెప్పి రహదారి గుంతల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇవ్వడంతో ఆదివాసి నాయకులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసేన గౌరవాధ్యక్షుడు మడావి గంగారం, ఆదివాసి సేన వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్రం శంకర్, తుడుం దెబ్బ ఉపాధ్యక్షుడు సీడం శంకర్, నాయక్ పోడ్ సేవా సంఘం మండల నాయకులు మంగ శ్రీకాంత్ లవడం నవీన్ మండల ఆదివాసి నాయకులు సిడం రామదాసు, మడవి తరుణ్ తదితరులు పాల్గొన్నారు.