మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట ఒకటవ గనిని సందర్శించిన నూతన జిఎం దేవేందర్.

 మందమర్రి ఏరియా ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి.

-- నూతన జీఎం దేవేందర్.

 నూతన జిఎం దేవేందర్ ను సన్మానిస్తున్న గని అధికారులు కార్మిక సంఘాల నాయకులు. 

ScvNews Kasipet :--

మందమర్రి ఏరియా కాసిపేట ఒకటో గని ని ఇటీవల బదిలీ పై వచ్చిన జనరల్ మేనేజర్. G దేవేందర్ ఈరోజు మొదటిసారి గా  సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి జిఎం  మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్మికుడు ఏరియా వార్షిక ఉత్పత్తి సాధన కోసం కృషి చేయాలని కోరారు.  సంస్థ మొక్క లక్ష్యాలను, ఉత్పత్తి, ఉత్పాదకతలను, రక్షణ కూడిన ఉత్పత్తి తీసి సంస్థ కు మంచి పేరు తీసుకురావడంలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని అన్నారు.  ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్షణలో పని చేయాలని అప్పుడే అందరు సంతోషంగా ఉండడం వల్ల ఆర్ధికంగా కూడాబలంగా ఉంటామన్నారు. మందమర్రి గ్రూపు ఏజెంట్  శ్రీ రాందాస్  మాట్లాడుతూ సంస్ధ ఇచ్చిన ఉత్పత్తి లక్ష్యం చేరుకోవడానికి అందరం కృషి చేయాలని అన్నారు.AITUC బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్  మాట్లాడుతూ కార్మికులు ఉత్పత్తి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని, మా గని టార్గెట్ పూర్తి చేస్తామని అన్నారు. కాసిపేట గని మేనేజర్ బు శంకరయ్య కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. 

ఈ కార్యక్రమంలో కాసిపేట సేఫ్టీ అధికారి శ్రీ సునీల్ కుమార్,కాసిపేట పిట్ ఇంజనీర్ శ్రీ మధుకర్,డిప్యూటీ మేనేజర్ నిఖిల్, దిలీప్ కుమార్,పిట్ సెక్రెటరీ మీనుగు లక్ష్మీ నారాయణ పాల్గొనడం జరిగింది.

జనరల్ మేనేజర్ గారిని సన్మానించిన అధికారులు,కార్మిక సంఘాల ప్రతినిధులు.

మందమర్రి జనరల్ మేనేజర్ గా పదవి బాధ్యతలు  స్వీకరించి కాసిపేట గని కి మొదటిసారి విచ్చేసిన శ్రీ G. దేవేందర్ గారిని ఏజెంట్ రామ దాసు, మేనేజర్ భూశంకరయ్య, SO సునీల్ కుమార్ ఇతర అధికారులు కలసి ఘనంగా సన్మానించారు.అలాగె ఏరియా ఇంజనీర్ వెంకట రమణ గారిని మాజమాన్యం,AITUC పిట్, మైన్స్ కమిటీ ప్రతినిధులు, బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్, మీనుగు లక్ష్మీ నారాయణ, INTUC ప్రతినిధులు బాపు,శంకర్, రాజన్న,కన్నయ్య,పిట్టల శివ, TBGKS ప్రతినిధులు ఓడినల రాజన్న,చోల్లంగి శ్రీనివాస్, అబ్దుల్ తదితరులు పాల్గొని సన్మానించారు.