మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో పచ్చదనం పరిశుభ్రత.

 దేవాపూర్ మేజర్ పంచాయతీలో స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమం.

 దేవాపూర్ లో స్వచ్ఛధనం పరిశుభ్రత  ఊరేగింపులో పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్ గంగారం ఎంపీవో   షబధర్ అలి, మహిళా సంఘాలు ప్రజాసంఘాల నాయకులు.


Scv News Kasipet :--

కాసిపేట మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ కేంద్రాలలో  సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛ దినం,  పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ కేంద్రాలలో అంగన్వాడి కార్యకర్తలు,  ఆశా వర్కర్  మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించి గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత వల్ల జరిగే ఉపయోగాలను అధికారులు వివరించారు. తదనంతరం గ్రామాల్లో ఊరేగింపులు నిర్వహించారు.

 దేవాపూర్ మేజర్ పంచాయతీలో...

దేవాపూర్ గ్రామపంచాయతీ లో వన మహోత్సవం స్వచ్ఛదనం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించారు.సమావేశం ఏర్పాటు చేసి అంగన్వాడి కార్యకర్తలు ఆశా కార్యకర్తలు మహిళ సంఘాల కు యువతకు  స్పెషల్ ఆఫీసర్ గంగారం ఎంపీ ఓ సర్దార్ హాలీ హాజరై  స్వచ్ఛతనం, పచ్చదనం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు . గ్రామ వీధుల్లో  ఊరేగింపు చేయడం జరిగింది. అనంతరం మహిళ సంఘ భవనం చుట్టుపక్కల గడ్డి పిచ్చి మొక్కలను శ్రమ దానం చేసి శుభ్రం చేశారు. గ్రామ పంచాయతీ  సమస్యల పై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  కవిత పంచాయతీ కార్యదర్శి, మెరుగు పద్మ,మాజీ ఎంపీటీసీ శంకర్ మొగిలి, మాజీ ఎంపీటీసీ సామ రాజిరెడ్డి,మాజీ ఉప సర్పంచ్ గుండా శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు కొమ్ముల బాపు, సిడం రామదాసు, షకీల్ బాయ్, అంగన్వాడి, ఆశ  కార్యకర్తలు, మహిళ  సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.