గట్రావుపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించిన ఆదివాసి సేన నాయకులు .
Scv News Kasipet :--
గట్రావ్ పళ్లి లోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించిన ఆదివాసి సేన నాయకులు.
కాసిపేట మండలం గట్రావుపల్లి గ్రామంలో గత 20 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఆరోగ్య ఉపకేంద్రం పనులు ఎట్టకేలకు పూర్తి చేశారు. ఈరోజు ఆదివాసి నాయకులు ఉప కేంద్రాన్ని సందర్శించారు. ప్రతి వర్షాకాలంలో అతిసారా, విష జ్వరాలతో గిరిజనులు మరణిస్తున్నారు కాబట్టి వెంటనే ఆరోగ్య ఉప కేంద్రానికి సిబ్బందిని నియమించి వైద్య సేవలు ప్రారంభించాలని ఆదివాసి నాయకులు కోరుతున్నారు. ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించిన వారిలో కాసిపేట మండల ఆదివాసీ సేనా ప్రధాన కార్యదర్శి సిడం గణపతి. పెందూర్ ప్రభాకర్. అర్క ఈశ్రు. కుడ్మెత రఘు. పెందూర్ గుల్వంత్ రావ్లు వున్నారు.