మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

చిత్రలేఖన పోటీలో జిల్లా స్థాయి బహుమతి గెలుచుకున్న విద్యార్థికి సా చై వే ఆధ్వర్యంలో సన్మానం.

 ప్రీతి కుమారీ ని సన్మానించిన సాచైవే ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు.

  చిత్రలేఖన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన దేవాపూర్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి ప్రీతి కుమారిని సన్మానిస్తున్న సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు.


Scv News Kasipet :---

 కాసిపేట మండలం దేవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి  విద్యార్థి  ప్రీతి కుమారి చిత్రలేఖన పోటీలో జిల్లా స్థాయిలో బహుమతి గెలుచుకుంది. ఇటీవల మంచిర్యాల జిల్లా కేంద్రంలో   పర్యావరణ పరిరక్షణ దినం సందర్భంగా  భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ,కరువు స్థితిస్థాపకత అనే అంశాలపై నిర్వహించిన జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఈ సందర్భంగా ఈరోజు దేవాపూర్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో తొమ్మిదవ తరగతి విద్యార్థి ప్రీతి కుమారి ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు  ఘనంగా శాలువతో సన్మానించడం జరిగింది. 

ఈ సందర్భంగా కొమ్ముల బాపు మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన దేవాపూర్ నుండి చిత్రలేఖ పోటీలో జిల్లా స్థాయిలో ప్రీతి కుమారి  బహుమతి గెలుచుకోవడం దేవాపూర్ కు గర్వకారణం అన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల లో ఉన్న వివిధ ప్రతిభాపాటవాలను  వెలికి తీసి బహుమతులు గెలుచుకోవడంలో ప్రోత్సహిస్తున్న జిల్లా పరిషత్ ఉపాధ్యాయు లకు  అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాథోడ్ రమేష్ ఉపాద్యాయులు ఉపాధ్యాయిని లు విద్యార్థులు పాల్గొన్నారు.