మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసి నేత శిదాం శంభు 6 వర్ధంతి కార్యక్రమం.

 ఆదివాసి హక్కుల కోసం పోరాడిన ఆదివాసి నేత సిడం శంబు కు ఘన నివాళి.

 ఆదివాసి నేత సీడం శంభుకు నివాళులర్పిస్తున్న ఆదివాసి సంఘాల  నేతలు .






Scv News Kasipet:--

కా సిపేట మండలం లోని దేవాపూర్ గ్రామ పంచాయతీ  అవరణ లోని కమ్యూనిటి హాల్ లో ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఆదివాసి అమరుడు సిడం శంభు పటేల్  6 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆదివాసి నేతలు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నాయక్ పోడు  సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ శిదాం శంభు  ఆదివాసి సమాజం కోసం హక్కుల అమలు కోసం ఎన్నో పోరాటాలు చేసిన మహనీయుడన్ని  ఆయన సేవలను గుర్తు చేశారు. తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి అడే జంగు మాట్లాడుతూ శిదాం శంభు ఆదివాసుల హక్కుల సాధనకు ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపారని అన్నారు.

 ఈ కార్యక్రమంలో కాసిపేట మండల నాయకపాడు సేవ సంఘం మండల అధ్యక్షులు బద్ది శ్రీనివాస్. కాసిపేట మండల ఆదివాసి సేన ఉపాధ్యక్షులు పెందురు ప్రభాకర్ తుడుందెబ్బ  మండల గౌరవ అధ్యక్షులు ఆత్రం జంగు ఓరియంట్ సిమెంట్ యూనియన్ నాయకులు తట్ర భీమ్రావు. నాయక పోడ్ సేవ సంఘం సాంస్కృతిక కార్యదర్శి రెడ్డి లక్ష్మణ్,అనిల్,రవి, తదితరులు పాల్గొన్నారు.