మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఎస్ఎఫ్ఐ పాఠశాలల బంధు విజయవంతఓ.

 

 నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి.

 - ఎస్ఎఫ్ఐ కాసిపేట మండల కార్యదర్శి కొమ్ముల రజిత.





Scv News Kasipet :--

 కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో  మెడికల్ విద్యార్థులకు నిర్వహించే పరీక్షలో జరిగిన అవకత వకలకు  నిరసనగా ఎస్ఎఫ్ఐ  ఇచ్చిన పాఠశాలల బంధు కాసిపేట మండలంలో విజయవంతం అయింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తరగతులను బహిష్కరించి బందులో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి కొమ్ముల రజిత మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఎ), మంచిర్యాల జిల్లా కమిటీ, జాతీయ కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా మెడికల్ విద్యార్థులకు నిర్వహించే ప్రవేశ పరీక్షలో జరిగిన అవకతవతకలను నిరసిస్తూ, జాతీయ పరీక్షల సమగ్రతను కాపాడాలని, కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థలలో సమస్యలు పరిష్కరించాలని జూలై 4వ దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నా మన్నారు.

ఎన్టీఏ ను రద్దు చేయాలి.

నీట్ ,యూజీసీ-నెట్,సి.ఎస్ఆర్ యూజీసీ కంబైన్డ్ నెట్ అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థలలో సమస్యలు పరిష్కరించాలని,

పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజురియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలన్నారు.నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని,ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీకి నియంత్రణ చట్టం తెచ్చి, అధిక ఫీజులను నియంత్రణ చేయాలన్నారు.దేశంలో పాఠశాలల మూసివేతను విరమించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో SFI విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు...