జిల్లా మత్స్యకారుల అభివృద్ధికి సాయశక్తులకు కృషి చేస్తా.
-- సూరం సంపత్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి
![]() |
| మత్స్యశాఖ కోపరేటివ్ సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎంపికైన సూరం సంపత్ కుమార్. |
![]() |
| సంబంధిత అధికారుల నుండి నియామక పత్రం అందుకుంటున్న సూరం సంపత్. |
Scv News Kasipet:--
కాసిపేట మండల బిజెపి మండల శాఖ అధ్యక్షులు సూరం సంపత్ కుమార్ ను మత్సగంధి మల్టీ స్టేట్ ఫిషర్ మెన్ కోపరేటివ్ సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం జరిగింది. నియామక పత్రా న్ని సంబంధిత అధికారుల నుండి అందుకున్నా రు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు పుల్ల బోయిన భీమన్న తనపై ఉన్న నమ్మకంతో మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో ఉన్న చేపల వృత్తిపై ఆధారప డి పనిచేస్తున్న ప్రతి ఒక్క మత్స్యకారులకు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా భాగస్వాములై, ప్రతి ఒక్కరూ సేవలు వినియోగించుకోవాలని, వారి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
జిల్లా మత్స శాఖ కోపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన కాసిపేట మండల వాసి సూరం సంపత్ కుమార్ కు మండలంలోని మత్స్యకార సంఘాలు, వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.

