రుణాల పేరిట రైతులను మోసం చేస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలని తుడుం దెబ్బ డిమాండ్.
Scv News Kasipet :--
దేవపూర్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ కు వినతి పత్రం అందజేస్తున్న తుడుం దెబ్బ నాయకులు.
కాసిపేట మండలంలోని వివిధ గిరిజన గ్రామాలలో ని ఆదివాసి రైతుల నుండి రుణాలు ఇప్పిస్తామని చెప్పి కొంత మంది దళారులు మోసం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని దేవాపూర్ యూనియన్ బ్యాంక్ అధికారులను మండల తుడుం దెబ్బ నాయకులు డిమాండ్ చేశారు. మంజూరైన రుణాలలో కొంత దళారులు తీసుకొని రైతులను మోసం చేస్తున్నారని వీరిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా పోలీస్ ల కు ఫిర్యాదు చేయాలని బ్యాంక్ అధికారులను కోరారు.
బ్యాంక్ మేనేజర్ దిలీప్ కుమార్ కు తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు సండ్ర భూమయ్య ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు ఆత్రం జంగు, జిల్లా నాయకులు పెంద్రం హనుమంతు, వెడమ కిషన్, రాందాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.