మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ముత్యం పల్లి దళిత రైతులకు న్యాయం చేయాలని తహసిల్దార్ కు పిర్యాదు.

 

 చిన్న ధర్మారం కుంట తూములను ధ్వంసం చేసిన భూస్వామి పై కేసు నమోదు చేయాలని దళిత రైతుల డిమాండ్. 

 తమ భూములకు సాగునీరు అందించాలని ముత్యం పల్లి దళిత రైతులు తాసిల్దార్ కు వినతి.

Scv News Kasipet:--

 కాజీపేట మండలం చిన్న ధర్మారం గ్రామ శివారులో ని కుంట కింద సాగు చేసుకుంటున్న ముత్యం పల్లి దళిత రైతుల భూములకు సాగునీరు అందకుండా అడ్డుకుంటున్న భూస్వామిపై చర్యలు తీసుకోవాలని దళిత రైతులు తాసిల్దార్ కు ఈ రోజు ఫిర్యాదు చేశారు. రైతుల కథనం ప్రకారం చిన్న ధర్మారం కుంట కింద  ముత్యం పల్లి దళిత రైతులకు 40 ఏళ్ల కింద ప్రభుత్వం ఇనాం కింద సుమారు 30 ఎకరాల భూముల పంపిణీ చేసింది. కుంటలోని ఎడమ తూము కింద వచ్చే నీటితో దశాబ్దాలుగా వరి పంట సాగు చేసుకుంటున్నారు.కుంటలో పూడికతీత తూముల  మరమ్మత్తు కోసం తెరాస ప్రభుత్వం మొదటి విడత మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 24 లక్షల నిధులను మంజూరు చేసింది. నిధులతో మరమ్మత్ పనులను పూర్తి చేసింది. 

చెరువులోని నీటి నిల్వ ఉన్న భూమి తమదేనంటూ ముత్యం పెళ్లి గ్రామానికి చెందిన భూస్వాములు నర్సింగరావు, మదన్ రావులు గతంలో వర్షాకాలంలో నిలువ నీటితో కుంట కింద సుమారు 50 ఎకరాల వరి సాగు చేసుకుంటు న్నారు. వర్షాకాలం పంట తర్వాత నీటి మొత్తాన్ని వెళ్ళగొట్టి సెనగ, మొక్కజొన్న పంటలు సాగు చేసుకుంటున్నారు. గత సంవత్సరం నుండి  వర్షాకాలంలో దళితుల భూములకు నీరు వచ్చే తూములను ధ్వంసం చేసి నీరు మొత్తం వెళ్లగొట్టి  మీరు నిలిచే కుంట లోనే వరి పంట సాగు చేసుకుంటున్నారు. దీంతో దళితుల భూములకు సాగునీరు అందడం లేదు. తూములు కాలువలు ఎందుకు ధ్వంసం  చేశారని నర్సింగరావు అడిగితే 'కుంట మొత్తం నా పట్టా భూమి కాబట్టి నేనే సాగు చేసుకుంటా ఏం చేస్తారో చేసుకో ' అంటూ బెదిరిస్తున్నాడని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 భూస్వాములకు చెందిన ప్రైవేటు భూమిలోని  ప్రైవేటు కుంటకు ప్రభుత్వ నిధులు  ఎలా ఖర్చు చేశారని దళిత రైతులు ప్రభుత్వ ఇంజనీర్లను ప్రశ్నిస్తే పట్టించు కోవడంలేదని  తెలిపారు . తమ భూములకు చావుని అందించే కాలువలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చామని దళిత రైతులు  ఒక ప్రకటనలు తెలిపారు.