మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పట్టేదారు పాసుపుస్తకం లో అనుభవదారు కాలం చేర్చాలి.

 అనుభవదారుకాలం చేర్చాలని ప్రజావాణిలో ఆదివాసి నాయకుల వినతి. 

 పట్టే దార్ పాస్ పుస్తకంలో అనుభవదారు కాలం చేర్చాలని వినతి పత్రం అందజేస్తున్న నాయక్ పోడ్ సేవా సంఘం నాయకులు .

Scv News Kasipet :--

 గత తెరాస ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకం లో అనుభవ దారుడి పేరు  ఎత్తివేసి  నిరుపేద రైతుల భూములు భూస్వాములకు అప్పచెప్పి తీవ్ర అన్యాయం చేసిందని ఆదివాసీ నాయక్ పూర్ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, మండల ప్రధాన కార్యదర్శి మెన్డ్రపు రాజన్న లు ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. గత ఎన్నికల కాలంలో ధరణిలో అనుభవదారుల కాలమెత్తి వేస్తానని  ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన మాట నిలుపుకోవాలని ఒక ప్రకటనలో కోరారు. రైతుల పట్టేదారు పాస్ పుస్తకంలో గత 40 సంవత్సరాలుగా  అనుభవదారు కాలముందని  తెరాస ప్రభుత్వం దాని తొలగించడం వల్ల  పేద రైతులకు అన్యాయం జరిగిందన్నారు. రైతులు ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి  అనుభవదారు కాలం మళ్ళీ పట్టాదార్ పాస్ పుస్తకంలో చేర్చాలని ఎంపీడీవోను కోరారు.