విద్యార్థులు సమయం విలువ తెలుసుకోవాలి.
-- ధర్మరావుపేట జెడ్ పి హెచ్ ఎస్ hm సుధాకర్ నాయక్.
![]() |
| స్వర్గీయ అనసూయ టీచర్ బంధువులు పాఠశాలకు స్మారకంగా గోడ గడియారాలు అందజేస్తున్న దృశ్యం. |
Scv News Kasipet :-
విద్యార్థులు సమయం విలువ తెలుసుకొని సమయాన్ని వారి జీవితం తీర్చిదిద్దుకోవడానికి వినియోగించాలని ధర్మారావుపేట ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ నాయక్ అన్నారు. విద్యార్థి జీవితంలో పాఠశాల విద్యా సమయం అత్యంత కీలకమని, ఈ సమయాన్ని ఎవరైతే చక్కగా సద్వినియోగ పరుచుకుంటారో వారి జీవితాలు బంగారు మయమవుతాయని, భవిష్యత్తుకు బాటలు నిర్మిస్తాయని అన్నారు.
ధర్మారావుపేట ఉన్నత పాఠశాలలో గురువారం స్వర్గీయ బొంకూరి అనసూయ (మందమర్రి) రిటైర్డ్ టీచర్ నాలుగవ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసి, పాఠశాలకు గోడ గడియారాలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అనసూయ మేడం ఎనలేని సేవ చేసిందని ఉపాధ్యాయులు అందరూ కొనియాడారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలను ఎంచుకొని సేవ చేయడం చాలా మంచి పరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు అరుణ్ ప్రదీప్, సంధ్య, కిరణ్ సందీప్, శృతి వినయ కుమారి, బాబ్జి మరియు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
