ఆర్ధిక దోపిడీకి పాల్పడిన దళారుల నుండి సొమ్మును రికవరీ చేసి బాధితులకు అందజేయాలి.
-- ఆదివాసి సేన కాసిపేట మండల అధ్యక్షులు మడావి వెంకటేష్ డిమాండ్.

ఆదివాసి సేన మండల అధ్యక్షుడు మడవి వెంకటేష్.
Scv News Kasipet :--
కాసిపేట మండలం దేవాపూర్ యూనియన్ బ్యాంక్ లో రుణాలు పొందేందుకు వస్తున్న అమాయక ఆదివాసి ప్రజల నుండి రుణ పత్రాలు పూర్తి చేయటం అనే పేరుతో ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న దళారులపై వ తగు చర్యలు చేపట్టి వారి వద్ద ఉన్న రైతుల బ్యాంకు పుస్తకాలు, పట్టా పాసు పుస్తకాలు, ఆధార్ కార్డులను వెంటనే బాధితులకు ఇప్పించే విధంగా చూడాలని బ్యాంకు అధికారులను ఆయన ఒక ప్రకటనలో కోరారు.
ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న దళారులు బ్యాంక్ ఆవరణలోనే యదేచ్చగా తమ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతు న్నప్పటికి బ్యాంక్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించ డాన్ని తప్పుపట్టారు. దోపిడీకి పాల్పడిన సొమ్మును దళారుల నుండి రికవరీ చేసి బాధితులకు యిచ్చేవిధంగా వెంటనే తగు చర్యలు చేపట్టని యెడల బ్యాంకు ఆవరణలో ఆందోళనలకు దిగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా భవిష్యత్తులో దళారుల నుండి ఇలాంటి ఆర్ధిక దోపిడులు జరగకుండా ఖాతాదారులకు కూడా ఆర్థిక అవగాహన తరగతులు నిర్వహించాలని ఆయన అన్నారు.