మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత బన్న లక్ష్మణ్ దాస్ కు అంబేద్కర్ సంఘం సన్మానం.



  బన్న లక్ష్మణ్ దాస్ కు అంబేద్కర్ జాతీయ అవార్డు రావడం  కాసిపేట వాసులకు గర్వకారణం. 

 -- సన్మాన సభలో వక్తల వ్యాఖ్యలు.

 అంబేద్కర్ జాతియ అవార్డు గ్రహీత బన్న లక్ష్మణ్ దాస్ ను సన్మానిస్తున్న మండల అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు.




Scv News Kasipet:--

 సామాజిక సేవా కార్యక్రమాలతో అంబేద్కర్ జాతీయ అవార్డుకు ఎంపికైన బన్న లక్ష్మణ్ దాస్ ను ఈరోజు కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మండల అంబేద్కర్ యువజన సంక్షేమ సంఘం  ఘనంగా సన్మానించింది. మండల అంబేద్కర్ సంక్షేమ  సంఘం అధ్యక్షుడు జాడిపోశం ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘం నాయకులు  శాలువా, పంచశీల కిరీటం, పూల బొకేతో సన్మానించారు.

 ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన మండల యువజన  సంఘం అధ్యక్షుడు  జాడి పోశం మాట్లాడుతూ బన్న లక్ష్మణ్ దాస్ కు అంబేద్కర్ జాతీయ అవార్డు రావడం కాసిపేట మండలానికి గర్వకారణం అన్నారు.  అంబేద్కర్ యువజన సంఘం సలహాదారులు     మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ  మండలంలో భూస్వాములకు వ్యతిరేకంగా బహుజన  వర్గాలకు అండగా నిలిచి  దళిత నాయకుడుగా పేరొందిన బన్నా ఆశాలు వారసుడిగా అతని కుమారుడు  లక్ష్మణ్ దాస్ కు అంబేద్కర్ జాతీయ అవార్డు  రావడం గర్వకారణం అన్నారు.

 సిపిఐ మండల కార్యదర్శి దాగం  మల్లేష్ మాట్లాడుతూ లక్ష్మణ్ దాసు గత 20 సంవత్సరాలుగా చేసిన సామాజిక సేవలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ అంబేద్కర్ జాతీయ అవార్డు ఇవ్వడం జరిగిందన్నారు. 

అంబేద్కర్ సంఘం సలహాదారు  లంక లక్ష్మణ్ మాట్లాడుతూ బన్న లక్ష్మణ్ దాస్ కు  అంబేద్కర్ జాతీయ అవార్డు రావడం అంబేద్కర్ వాదులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని కాసిపేట మండల కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణంకు కృషి చేయాలని కోరారు. 

అంబేద్కర్ యువజన సంఘం మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు కొమ్ముల బాపు మాట్లాడుతూ లక్ష్మందాసు గత 20 ఏళ్లుగా మండలంలో తెలంగాణ ఉద్యమము, స్వచ్ఛంద సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల అతడి సేవలను గుర్తించి జాతీయ అవార్డుకు చేయడం గర్వకారణం అన్నారు. 

అంబేద్కర్ యువజన సంఘం మండల కార్యదర్శి దాసరి రాజన్న మాట్లాడుతూ మండలంలోని సామాజిక సేవా కార్యక్రమంలో లక్ష్మందాస్ చురుగ్గా పాల్గొని సేవా కార్యక్రమాలు చేసినందుకు గుర్తింపుగా జాతీయ అవార్డు రావడం సంతోషకరమన్నారు.

 అంబేద్కర్ సంఘం మండల నాయకుడు  గోదారుల శంకర్ మాట్లాడుతూ మండలంలో బహుజన నాయకుడిగా పేరొందిన బన్న ఆశాలు వారసుడిగా లక్ష్మణ్ దాస్ అదే ఒరవడిగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ జాతీయ అవార్డు పొందడం గర్వకారణం అన్నారు. 

మండల అంబేద్కర్ సంఘం సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ బన్న లక్ష్మందాస్ చేసిన సామాజిక సేవ ఉద్యమాలకు గుర్తింపుగా అంబేద్కర్ జాతీయ అవార్డు రావడం  కాసిపేట మండలానికి గర్వకారణం అన్నారు. అవార్డుతో లక్ష్మణ్ దాస్ పై అంబేద్కర్ భావజాలాన్ని మండలంలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత పెరిగిందన్నారు.

 సమావేశంలో మండలం అంబేద్కర్ సంఘం నాయకులు అగ్గి స్వామి, రత్నం రాజం లక్ష్మణ్ దాస్ చేసిన సేవలు గురించి మాట్లాడారు. 

తదనంతరం అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత   బన్న లక్ష్మణ్ దాస్ మాట్లాడుతూ  గత 20 ఏళ్లుగా తాను చేసిన సేవలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ అంబేద్కర్ జాతీయ అవార్డు ఎంపిక చేయడం మండల వాసిగా తనకు ఎంతో గర్వకారణం అన్నారు. మండల ప్రజల ఆశీర్వాదంతోనే తనకు అవార్డు వచ్చిందన్నారు. బహుజన సాహిత్య అకాడమీ తన గురించి ఎన్నో విధాలుగా తనిఖీ చేసి అవార్డు ఎంపిక చేసిన వివరాలను వెల్లడించారు. మండలంలోని గ్రామాల్లో అంబేద్కర్ భావజాల ప్రచారం కోసం మండల కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణం కోసం శాయశక్తుల కృషి చేస్తానన్నారు.  తనను ఘనంగా సన్మానించిన అంబేద్కర్ యువజన సంఘం నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ సంఘం నాయకులు రామ టెంకి వాసుదేవ్, దాగం రాజలింగు తదితరులు పాల్గొన్నారు.