బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కొండాపూర్ చౌరస్తాలోని మండల ప్రధాన రహదారి గుంతల సమస్య తీర్చాలని కొండాపూర్ వాసుల వేడుకో లు .
ఈరోజు ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కి నీరు మొత్తం రహదారిపై నిలిచి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన దృశ్యాలు, వీడియో.
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రం ప్రధాన రహదారి అది. నిత్యం వందలాది వాహనాలు, ద్విచక్ర వాహనాలు వెళ్తుంటాయి. మండలంలోని అన్ని గ్రామాలకు వెళ్లే ప్రధానమైన కూడలి కొండాపూర్ చౌరస్తా ఆది.దేవాపూర్, సోనాపూర్ నుండి సోమగూడెం వరకు వెళ్లే రోడ్లు భవనాల శాఖ ప్రధాన రహ దారి అది.
మండల ప్రజలంతా ప్రయాణించే మండల ప్రధాన రహదారి ని కొంతమంది స్వార్థపరులు తమ స్వలాభాల కోసం రహదారిని డ్రైనేజీగా మార్చారు. రహదారిపై వర్షపునీరు నిలిచి పెద్దపెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు గుంతలో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు.
గత తెరేస ప్రభుత్వ హాయంలో నాలుగేళ్లుగా ఈ రహదారిపై వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచి గుంతల మయమై ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. డ్రైనేజీల పై ఉన్న కబ్జాలను తొలగించి వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని ప్రతి వర్షాకాలంలో గ్రామస్తులు కోరిన తెరాస ప్రజా ప్రతినిధులకు నాయకులకు దున్నపోతు పైన వాన పడ్డ చందంగా పట్టించుకోలేదు. పైగా డ్రైనేజీ నిర్మాణం కోసం పది లక్షల నిధులు మంజూరయ్యాయని త్వరలో పనులు చేపడతామంటూ గత మూడేళ్లు వాగ్దానాలతో మండల తెరాస నాయకుడు కొండాపూర్ ప్రజలను మభ్యపెట్టి ఆబాసు పాలయ్యాడు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రహదారిపై నీరు నిలవకుండా డ్రైనేజీ నిర్మిస్తామంటూ పది లక్షల నిధులు మంజూరయ్యాయని స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఇటీవల కంకర ,ఇసుక తెచ్చి నిలువ చేశారు. సమస్య ఉన్న వద్ద డ్రైనేజీ నిర్మించకుండా వేరే కాడ నిర్మిస్తామంటే గ్రామస్తులు వ్యతిరేకిస్తు న్నారని పనులు ప్రారంభించలేదు.
ఇప్పటికైనా మండల కాంగ్రెస్ పార్టీ బాధ్యులు రత్నం ప్రదీప్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ప్రత్యేక చొరవ చూపి రహదారి పరిస్థితిని ప్రత్యేకంగా చూసి రోడ్లు భవనాల శాఖ అధికారులతో వర్షపు నీరు రహదారిపై నిలవ ఉండకుండా డ్రైనేజీ నిర్మించాలని, గతంలోని డ్రైనేజీలపై కబ్జాలను తొలగించాలని కొండాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు.

