రామ - రావణ యుద్ధం

వెనుక ఉన్న నిజమైన చరిత్ర

ఏమిటి? 

-ఆర్య, ద్రావిడ జాతుల మధ్య యుద్ధమే రామాయణం.

' రామాయణం అంటే  ఆర్య ద్రావిడ జాతుల మధ్య జరిగిన ఘర్షణయే  రామ, రావణ యుద్ధం ' అంటాడు పెరియార్.



Scv News Kasipet:--

 దక్షిణాసియా నుండి వలస వచ్చిన ఆర్యులు క్రీస్తు పూర్వం 1500 ఈ సంవత్సరం నాటికి గంగా,సింధూ నది పరివాహక ప్రాంతమైన ఉత్తర భారతాన్ని మొత్తం ఆక్రమించి పరిపాలన సాగించేవారు.  రామాయణం కాలం నాటికి  ఉత్తర భారతదేశం అంతా ఆక్రమించి దక్షిణ భారతానికి విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు.ఉత్తర భారత దేశంలో ఆర్యులు నివసించిన  ప్రాంతాన్ని 'ఆర్యావర్తనం 'అంటారు.వీరి సరిహద్దులు ఉత్తరాన హిమాలయ పర్వతాలు,దక్షిణాన వింధ్య సాత్పురా పర్వతాలు, తూర్పున  బంగాళా ఖాతం,పడమరన అరేబియా సముద్రాలుగా ఉండేవి. దక్షిణ వైపున ఉన్న  భారతదేశం లో ప్రస్తుత తెలంగాణ నుండి కేరళ వరకు ద్రావిడ రాజుల పరిపాలన సాగుతున్నది.

ద్రావిడు లు పర్యావరణ పరిరక్షకులు.  మాతృస్వామిక సమాజానికి ప్రతీకైన ద్రావిడ రాణి  తాటకి  పరిపాలనలో దండకారణ్యం ఉండేది. ఆర్యులు ద్రావిడ  పరిపాలనలో ఉన్న దక్షిణ భారత దేశాన్ని కూడా ఆక్రమించాలని దుర్బుద్ధితో ఆర్య ఋషులు యజ్ఞ యాగాలు చేయాలని  ఉత్తర భారతదేశం నుండి వింధ్య పర్వతాలు దాటి దక్షిణ భారతదేశంలోని దండకారణ్య ప్రాంతానికి వచ్చారు. యజ్ఞ యాగాలు పేరిట పచ్చటి అడవులను దగ్ధం చేసే  పర్యావర ణాన్ని నాశనం చేసే యజ్ఞ యాగాదులను ఇక్కడి ద్రావిడ రాజులూ వ్యతిరేకించారు.

మా ప్రాంతంకు ఎందుకు వచ్చారని ఆర్య రుషుల తో  యుద్ధాలకు దిగారు. ద్రవిడ రాజుల దాటికి తట్టుకోలేక ఆర్య ఋషులు క్షత్రియుడైన రామలక్ష్మణులను బాల్య దశలోనే  దండకారణ్యానికి తీసుకు వచ్చి వాళ్ళ యజ్ఞ యాగాదులను వ్యతిరేకించిన ఈ ప్రాంత ద్రావిడ రాణి తాటకిని సంహరించి యజ్ఞయాగాదులు చేసుకున్నారు. తరువాత రాముడు అయోధ్య రాజు అయిన తర్వాత తన పినతల్లి కైకేయి తన కుమారుడు భరతుడిని అయోధ్య పీఠం ఎక్కించేందుకు రాముడు ని అరణ్యవాసానికి పంపించిన సంగతి మనకు తెలిసిందే. రాముడు  అరణ్యవాసం అంతా కూడా దండకారణ్యంలో జరిగింది.

దండకారణ్య ప్రాంతానికి అప్పటి ద్రావిడ చక్రవర్తి రావణుడి చెల్లెలు సూర్పనఖ పరిపాలనలో ఉండేది. రాముడి అందచందాలు చూసి  సూర్పనఖ తనను పెళ్లి చేసు కోవాలని కోరినందుకు  రాముడు ఆగ్రహం చెంది తన తమ్ముడైన లక్ష్మణుడు చేత ముక్కు చెవులు కోయించి  అందవిహీనంగా చేశారు. దీంతో ఆగ్రహం చెందిన ద్రావిడ రాజు రావణుడు తన చెల్లెలుకు జరిగిన అవమానాన్ని భరించలేక సీతను లంకకు ఎత్తుకు  వెళ్లడం, ఈ ప్రాంత ఆదివాసీ లైన హనుమంతుడు సుగ్రీవుల  వానరుల అండతో లంకను ద్వంసం చేసి రావణుడిని సంహరించి సీతను తీసుకు రావడం మనకు రామాయణం ద్వారా తెలిసిందే.

*రామ రావణ యుద్ధంలో ఎవరిది తప్పు బహుజనులు అంత పరిశీలించాలి.

* ఉత్తర భారతదేశం నుండి  దక్షిణ భారతదేశంలోని అడవుల్లోకి వచ్చు  యజ్ఞ యాగాల పేరిట పచ్చటి అడవులను ధ్వంసం చేయడం ఆర్యుల చర్య సమర్ధనీయమా?

* అడ్డుకున్న ఇక్కడి ద్రావిడ మూలవాసుల చక్రవర్తులను రాక్షసులుగా చిత్రీకరించి చంపడం న్యాయమా?

* పెళ్లి చేసుకోవాలని కోరినందుకు  సూర్పనఖ ముక్కు చెవులు కోయడం మనువాదులు కలియుగ దైవంగా కొలిచే   రాముడికి ఎంతవరకు సమంజసం?

* ఇప్పటి పరిస్థితుల్లో  మన సోదరి ని ఎవరైనా అవమానిస్తే మనం ఏం చేస్తాం. రావణుడు తన సోదరికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా సీతను ఎత్తుకెళ్లాడు దాంట్లో తప్పేముంది.

 * లంకలో సీత తన ఆధీనంలో ఉన్న  రావణుడు ఆమెపట్ల ఏనాడు కూడా  అసభ్యంగా ప్రవర్తించకు పోవడం అతడి గొప్ప మనసుకు నిదర్శనం.

రాముడు చారిత్రక పురుషుడు కాదు కల్పిత వ్యక్తి మాత్రమే.

- పుష్యమిత్ర శుంగుడు రాముడ ని చరిత్రకారుల వ్యాఖ్య.

భారతదేశంలో అయోధ్య పరిపాలించిన  రాముడు అనే వ్యక్తి చారిత్రక వ్యక్తి కాదని, కల్పిత వ్యక్తినని చరిత్రకారులు వ్యాఖ్యా నిస్తున్నారు. మౌర్య సామ్రాజ్యం బౌద్ధ చక్రవర్తి బృహద్రథుడుని  సర్వ సైన్యాధ్యక్షుడు హోదాలో  ఉంది  కుట్రపూరితంగా హత్యచేసి బ్రాహ్మణ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన పుష్యమిత్రుడే రాముడని ప్రముఖ బౌద్ధ చరిత్రకారుడు రాహుల్ సాంకృత్యాయన్ తన ' 'ఓల్గా సే గంగా' అనే పుస్తకంలో ఉదాహరణలతో వివరించారు.

 దేశంలో బౌద్ధాన్ని ప్రతి ఘాతక విప్లవంతో ధ్వంసం చేసిన పుష్యమిత్రుడు పాలనలో రామాయణం, పురాణాలు లిఖించ బడ్డాయని అతని పాలన రామరాజ్యంగా  మనువాద బ్రాహ్మణ వర్గం కీర్తి ఇస్తుందని తెలిపారు. అయోధ్యలోని రామమందిరం  నిర్మించే స్థలంలో తవ్వకాలలో బౌద్ధ ఆరామాల అవశేషాలు వెలుగుచూశాయి. రామాలయ నిర్మాణం కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభావితం చేసి  తమకు అనుకూలమైన తీర్పులు తెచ్చుకొని రామాలయాన్ని మనువాదులు నిర్మించు కుంటున్నారు. తరతరాలుగా బ్రాహ్మణ వర్గం చేతిలో అణచివేయ బడుతున్న బహుజన వర్గంలోని సోదరులు చాలామంది ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావడం విచారకరం.

మూలవాసుల చరిత్ర నేటి తరానికి తెలపాలని 'Scv News' చిన్న ప్రయత్నం చేసింది.

నేడు దేశంలో మనువాద బ్రాహ్మణ మతవాదుల విజృంభణ జోరుగా సాగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజనులకు సర్వ హక్కులు కల్పించే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నంలో ఉన్నారు. వారి భావజాలాన్ని ప్రచారం చేసుకునేందుకు ఆర్ ఎస్ ఎస్, విశ్వహిందూ పరిషత్,భజరంగ్ దళ్ , లాంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి. వారి అండతో వారి రాజకీయ విభాగమైన బీజేపీ దేశంలో అధికారంలో కొనసాగుతోంది. రాజ్యాంగాన్ని మార్చి మళ్లీ మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రమాదం మన బహుజన వర్గాలు గుర్తించకుండా మొద్దు నిద్రలో ఉన్నారు. ఈ దేశం  మూలవాసుల మైన మనం మన నిజమైన చరిత్రను తెలుసుకొని మేల్కొని   పూలే అంబేద్కర్ ఆలోచనా విధానంతో మనువాద బ్రాహ్మణ కుట్రల పై పోరాడి బహుజన రాజ్యం సాధించాలనే లక్ష్యంతోనే ఈ వ్యాసాలు రాయడం జరిగింది. అంబేద్కర్ పూలే ఆలోచనా విధానంతో ఉన్న మన బహుజన మేధావుల ప్రసంగాలు, పుస్తకాలు చదివి వ్యాసాలు రాయడం జరిగింది.

 ఇప్పటి పరిస్థితుల్లో బహుజన భావ ప్రచారం కూడా చాలా ముఖ్యం కాబట్టి  scv News   చిన్న ప్రయత్నం చేసింది . దీన్ని వ్యాసాలపై మీ వాట్సాప్ గ్రూపు లో అభిప్రాయాలు చెప్పాలని మనవి.